బాబు ఓట‌మి జ‌గ‌న్ చేతిలో.. జ‌గ‌న్ ఓట‌మే బాబు చేతిలో లేదా...?

ఔను! వైసీపీలో ఈ విష‌యం తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌కు వ‌స్తోంది.రాష్ట్రంలో నువ్వా-నేనా అనే రేంజ్‌లో రాజ‌కీయాలు చేసుకునే పార్టీల్లో.

 Kuppam In Chittoor District Is Only Left For Tdp, Tdp,chnadra Babu Naidu,ysrcp,-TeluguStop.com

వైసీపీ, టీడీపీలే ముందున్నాయి.దీంతో ఒక‌రిపై మ‌రొక‌రు పైచేయి సాధించేందుకు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు.

గ‌తంలో అధికారంలో ఉన్న చంద్ర‌బాబు.వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను దెబ్బ‌కొట్టాల‌ని నిర్ణ‌యించారు.

పులివెందుల‌లో జ‌గ‌న్‌ను ఓడించ‌డంతోపాటు క‌డ‌ప‌లోని 10 అసెంబ్లీ స్థానాల్లో ఐదు, రెండు ఎంపీ స్థానాల్లో ఒక‌టి త‌న ఖాతాలో వేసుకునేందుకు బాబు ప్ర‌య‌త్నాలు చేశారు.కానీ, ఆయ‌న స‌క్సెస్ కాలేక పోయారు.

పైగా ఇప్పుడు క‌డ‌ప‌లో పూర్తిగా టీడీపీ చ‌తికిల ప‌డిపోయింది. పులివెందుల నుంచి వైఎస్ కుటుంబంపై ప్ర‌తిసారీ పోటీ చేస్తున్న టీడీపీ నాయ‌కుడు సతీష్‌కుమార్‌రెడ్డి కాడి ప‌డేశారు.

టీడీపీకి బై చెప్పి.వ‌చ్చి వైసీపీలో చేరిపోయారు.

అదే స‌మ‌యంలో సీఎం ర‌మేష్‌, ఆదినారాయ‌ణ రెడ్డి వంటివారు కూడా బీజేపీలో ఉన్నారు.దీంతో ఇప్పుడు క‌నీసం క‌డ‌ప‌లో టీడీపీ జెండా ఎగ‌రేసే నాయ‌కుడు క‌నిపించ‌డం లేదు.

అంటే.ఇక‌, జ‌గ‌న్ ఓడించాలి, క‌డ‌ప‌లో సైకిల్‌ను ప‌రుగులు పెట్టించాల‌నే బాబు వ్యూహం పూర్తిగా ఆవిర‌య్యింద‌నే క‌నిపిస్తోంది.

Telugu Chittoor, Chnadra Babu, Kuppamchittoor, Ys Jagan, Ysrcp-Telugu Political

అదేస‌మ‌యంలో ప్ర‌స్తుతం సీఎంగా ఉన్న జ‌గ‌న్‌. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ప‌ట్టు పెంచుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.చిత్తూరు జిల్లాల్లో ఒక్క కుప్పం త‌ప్ప‌.అన్ని నియోజ‌క‌వ‌ర్గాలూ ఇప్పుడు వైసీపీ నేత‌లే ఏలుతున్నారు.ఇక‌, కుప్పంలోనూ వైసీపీ ప‌ట్టు పెంచుకుంటే.ఇక‌, తిరుగు ఉండ‌ద‌ని అంటున్నారు.

ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను విస్తృతం చేశారు.
పేద‌ల‌కు ఇళ్ల‌తోపాటు.

కుప్పంను మున్సిపాలిటీగా ప్ర‌క‌టించి.అధునాత హంగుల‌తో మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తున్నారు.

నాడు-నేడు కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్నారు.దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి బాబు కు చెక్ పెట్టాల‌నే జ‌గ‌న్ వ్యూహం ఫ‌లిస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube