రోడ్డుపై రచ్చ చేసిన యూట్యూబర్ హర్ష.. రంగంలోకి దిగిన పోలీసులు..?

సోషల్ మీడియా( Social media)లో ఫేమస్ కావడానికి యూట్యూబర్లు పిచ్చి పనులు చేస్తూ సామాన్య జనాలకు చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారు.

ఇలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా సరే వాళ్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

రీల్స్ మోజులో పడి పైత్యం చూపిస్తున్నారు.తాజాగా హర్ష అనే ఓ తెలుగు యూట్యూబర్ తన రీల్స్ కోసం ఓ మూర్ఖపు పని చేశాడు.

సోషల్ మీడియాలో రీల్స్ కోసం గురువారం కూకట్‌పల్లి( Kukatpally )లో డబ్బులను గాల్లోకి విసిరేశాడు.ఆ కరెన్సీ నోట్లు కిందపడటం చూడగానే చాలామంది ప్రజలు వాటిని చేసుకోవడానికి రోడ్లపైకి ఎగబడ్డారు.

దీనివల్ల ఆ రోడ్డుపై నుంచి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.ఇక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితి ఎదురయ్యింది దీనివల్ల పాదచారులు కూడా భయాందోళనలకు గురయ్యారు.సదరు యూట్యూబర్‌ ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసి వ్యూస్, లైక్స్ వస్తాయని ఆశ పడుతున్నాడు.

Advertisement

కానీ రోడ్లపై తాను న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నానని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు.కూకట్‌పల్లిలో జరిగిన ఈ సంఘటనపై సైబరాబాద్ పోలీసుల( Cyberabad Police ) చాలా సీరియస్ అయ్యారు అంతేకాదు దీనికి కారణమైన హర్ష పరిచర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.

అతను చేస్తున్న చేష్టలను ఆపాలంటూ ఇంతకుముందు కొందరు పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చారు.యూట్యూబర్ల వింత చేష్టలు రోజురోజుకూ శృతిమించుతున్నాయని చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.యూట్యూబర్ హర్షపై రెండు పోలీస్ స్టేషన్‌లలో కేసు ఫైల్ అయింది.

సైబరాబాద్ పోలీసులు ఒక కేసు ఫైల్ చేయగా.సనత్‌నగర్‌లో ట్రాఫిక్ పోలీసులు మరో కేసు ఫైల్ చేశారు.

ఇదిలా ఉండగా నేను టెలిగ్రామ్‌లో గంటకు రూ.వేలల్లో మనీ ఎర్న్ చేస్తున్నా.మీరూ జాయిన్ అవ్వండి అంటూ కొన్ని వీడియోలు పోస్ట్ చేసి టెలిగ్రామ్ ప్రమోట్ చేస్తున్నాడు.

సినిమా విడుదలని నిర్ణయిస్తున్న ఓటిటి సంస్థలు.. గతి తప్పితే కష్టమే !
వీడియో: గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేయడానికి డేంజరస్ స్టంట్.. చివరికి?

అతని యూట్యూబ్ అకౌంట్లను పోలీసులు చెక్ చేస్తున్నారు.మళ్లీ ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలని ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు