బంపరాఫర్ అందించిన యూట్యూబ్.. 45 శాతం ఆదాయం షార్ట్స్ క్రియేటర్లకే!

యూట్యూబ్‌ పేరు తెలియని యువత ఈ ప్రపంచంలోనే ఉండదంటే నమ్మి తీరాల్సిందే.ఈ మాధ్యమం ద్వారా అనేకమంది క్రియేటర్లు బయటకి వస్తున్నారు.

 Youtube Provided By Bumperafar 45 Percent Of The Income Goes To The Creators Of-TeluguStop.com

ఇక టిక్ టాక్ మనదగ్గర బ్యాన్ అయిన తరువాత యూట్యూబ్ షార్ట్స్ కి బాగా గిరాకీ పెరిగిందనే చెప్పాలి.అదేనండి యూట్యూబ్ బాగా దాన్ని క్యాష్ చేసుకుంది.

అయితే నిన్న మొన్నటివరకు షార్ట్స్ చేసేవారికి పెద్దగా ఆదాయం అనేది ఉండేది కాదు.కానీ ఇపుడు షార్ట్-ఫారమ్ వీడియో క్రియేటర్లు డబ్బులు సంపాదించవచ్చు.

గూగుల్ యాజమాన్యంలోని స్ట్రీమింగ్ సర్వీస్ తన వీడియో ఫీచర్ షార్ట్‌లపై ప్రకటనలను పరిచయం చేస్తోందని తద్వారా, ఆదాయంలో 45 శాతం ఆదాయాన్ని క్రియేటర్లకు ఇస్తామని తాజాగా ప్రకటించింది యూట్యూబ్ యాజమాన్యం.టిక్‌టాక్‌ (మన దేశంలో బ్యాన్‌) తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు తాజా అప్‌డేట్‌ను తీసు కొచ్చింది.

షార్ట్-ఫారమ్వీడియోపై డబ్బు సంపాదించడానికి క్రియేటర్‌ల కోసం యూట్యూబ్‌ కొత్త మార్గాన్ని ఆవిష్కరించింది.

Telugu Bumber Offers, Creators, Ups, Youtubers-Latest News - Telugu

మారుతున్న డిజిటల్ ల్యాండ్‌ స్కేప్‌లో భారీ మద్దతునిచ్చేలా ఉండాలని కోరుకుంటున్నామని సంస్థ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ నీల్ మోహన్ అన్నారు.ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ వీడియో ప్లాట్‌ఫాంకి వున్న క్రేజ్ గురించి ఇక్కడ ప్రస్తావించాల్సిన పనిలేదు.తన యూజర్లకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూనే మరోవైపు క్రియేటర్లు తమ ట్యాలెంట్‌ను ప్రదర్శించుకునే అవకాశాన్ని కూడా కల్పించిన యూట్యూబ్‌ తాజాగా క్రియేటర్లకు డబ్బు సంపాదించుకునే అవకాశం కల్పిస్తోంది.

దీంతో యూజర్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube