కారులో దీపావళి చేసిన యువకులు కానీ చివరికి.. వీడియో వైరల్..

మన దేశంలో కొన్ని రోజుల క్రితం జరిగిన దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకున్నారు.

భారతీయ సంప్రదాయం ప్రకారం దీపావళి పండుగ అంటే దీపాల పండుగ అని దాదాపు అందరికీ తెలిసిందే.

దీపావళిలో బాణసంచా చేసిన కొంతమంది వారికి తోచినట్లు రకరకాల చోట్లలో బాణసంచా చేశారు.ఇలా రకరకాలుగా బానిసంచ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల ఆ వీడియోలకి లైక్స్ వస్తాయని ఈ కాలం నాటి యువత తప్పుదారి పడుతుంది.

ఇలాంటి పనులు చేసి చాలాసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు నేటి యువత.అంతేకాకుండా ఎదుటివారి ప్రాణాల మీదికి కూడా తెస్తున్నారు.

కొంతమంది యువకులు దీపావళి పండుగ రోజు హైవే పై వెళ్తున్న కారు లో నుంచి ఒక్కసారిగా బాణా సంచా కాల్చి హైవేపై వెళ్తున్న తోటి ప్రయాణికుల భయభ్రాంతులకు గురి చేశారు.సోషల్ మీడియాలో పోస్ట్ అయినా వీడియో ఆధారంగా పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

Advertisement

ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలకు హాని కలగేలా భయభ్రాంతులకు గురి చేశారంటూ ఆ ముగ్గురిపై చర్యలు తీసుకున్నారు.ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను రీల్‌గా అప్‌లోడ్ చేయడానికి ఇలా చేశామని నిందితులు విచారణలో చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.గుర్గావ్ లోని శంకర్ చౌక్ వైపు నుంచి గోల్ఫ్ కోర్స్ రోడ్ వైపు కొందరు యువకులు బ్లాక్ కారులో వెళ్తున్నారు.

కారు వేగంగా వెళుతున్నప్పుడు లోపల కూర్చున్న యువకులు బాణా సంచా తీసి కాల్చారు.ఈ దుశాలన్నిటిని మళ్లీ వీరే వెనుక కారు లో వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

దీపావళి రోజు రాత్రి వారు వీడియోను రికార్డ్ చేసినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై18, గురువారం 2024
Advertisement

తాజా వార్తలు