ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ప్రియుడుతో సహా పలువురిని మోసం చేసిన కిలాడీ లేడీ..!

గతంలో కేవలం మగవారు మాత్రమే మోసాలు, దారుణాలు చేసేవారు.ప్రస్తుతం కాలం మారింది.

అన్ని రంగాల్లో మగవాళ్లతో సమానంగా మహిళలు కూడా తమ సత్తా చాటుతున్న రోజులు ఇవి.అయితే ఓ మహిళ ఎదుటివారిని నమ్మించి మోసం చేయడంలో తాను పీహెచ్డీ చేసేసింది అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.గతంలో మగవాళ్ళ చేతిలో మోసపోయిన ఆడవాళ్లు ఎందరో ఉన్నారని తరచూ వినే వాళ్లం.

ప్రస్తుతం మహిళల చేతుల్లో అమాయక పురుషులు మోసపోతున్న ఘటనలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి.ఓ మహిళ చేసిన మోసాల గురించి ఏకంగా ఓ సినిమానే తీయొచ్చు.ఆమెకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.ఆదిలాబాద్ జిల్లాకు( Adilabad ) చెందిన గోమాస శిరీష అలియాస్ అనూష చదువుకోవడం కోసం హైదరాబాద్ వచ్చింది.

Advertisement

చదువుకునే రోజుల్లో సిద్ధార్థ్ అనే యువకుడితో ప్రేమలో పడింది.తాను జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం( Jr Asst Job ) చేస్తున్నానని చెప్పడంతో సిద్ధార్థ అనే యువకుడు అనూషను( Anusha ) వివాహం చేసుకున్నాడు.

వివాహం తర్వాత ప్రతిరోజు విధుల నిమిత్తం బయటకు వెళ్తున్నట్లు భర్త ముందు చాలా బాగా కలరింగ్ ఇచ్చేది.భర్త సిద్ధార్థ్ కూడా తన భార్య ప్రభుత్వ ఉద్యోగి అని పూర్తిగా నమ్మేశాడు.

గత రెండు నెలల క్రితం హైదరాబాద్ లోని మౌలాలికి చెందిన వాణిరెడ్డి( Vanireddy ) మేడ్చల్ కలెక్టర్ కార్యాలయానికి రాగా, అనూష పరిచయం చేసుకొని తాను వికారాబాద్ ఎమ్మార్వోగా పని చేస్తున్నానని వాణిను నమ్మించింది.తన ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉందని, కొంత డబ్బు ఖర్చు చేస్తే ఆ పోస్ట్ ఇస్తానని చెప్పడంతో వాణిరెడ్డి పూర్తిగా నమ్మేసింది.వాణిరెడ్డి ముందు వెనుక ఆలోచించకుండా తొలిత ఫోన్ పే ద్వారా రూ.90000 చెల్లించింది.

తర్వాత వాణి భర్తకు కూడా అదే ఆఫీసులో ఉద్యోగం ఇప్పిస్తానని వారి వద్ద నుండి మరో రూ.1.60 లక్షలు వసూలు చేసింది.ఇక ఫేక్ ఆర్డర్ కాగితాలు సిద్ధం చేసి, వారికి పంపించి ఉద్యోగాల్లో జాయిన్ కావాలని తెలిపింది.

ఇదేందయ్యా ఇది.. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్..
ఈ జనరేషన్ లో పోలీస్ రోల్స్ లో ఎక్కువగా నటించి విజయాలు సాధించిన స్టార్ హీరో వీళ్లే!

వాణిరెడ్డి ఎంతో సంతోషంగా ఆ నకిలీ ఆర్డర్ కాపీలను( Fake Job Offer ) తీసుకొని గత నెల 10న కలెక్టర్ ఆఫీసుకు వెళ్లింది.అక్కడ ఉండే సిబ్బంది ఇవి ఫేక్ ఆర్డర్ కాపీలు అని చెప్పడంతో వెంటనే వికారాబాద్ పోలీసులకు ఆశ్రయించింది.పోలీసులు కేసు నమోదు చేసి కిలాడీ లేడి అనూషను అదుపులోకి తీసుకొని, రూ.2.50 లక్షలు రికవరీ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు