కొడుకుల విషయంలో గర్వపడుతున్న ఎన్టీఆర్.. నన్ను మించిన సూపర్ స్టార్స్ అవుతారంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలోని నంబర్ వన్ హీరోల రేసులో ఉన్నారు.తారక్ కు ఇద్దరు కొడుకులు కాగా పెద్ద కొడుకు పేరు అభయ్ రామ్( Abhay Ram ) చిన్న కొడుకు పేరు భార్గవ్ రామ్ అనే సంగతి తెలిసిందే.

 Young Tiger Ntr Feeling About His Sons Details, Junior Ntr, Jr Ntr Sons, Abhay R-TeluguStop.com

అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఫోటోలు అరుదుగా సోషల్ మీడియాలోకి వచ్చినా ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతుంటాయనే సంగతి తెలిసిందే.అయితే కొడుకుల విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గర్వపడుతున్నారని తెలుస్తోంది.

పుత్రోత్సాహంతో తారక్ పొంగిపోతున్నారని తెలుస్తోంది.అటు అభయ్, ఇటు భార్గవ్ చాలా టాలెంటెడ్ అని అభయ్ సైలెంట్ గా ఉంటూనే తన టాలెంట్ తో మెప్పిస్తుంటే భార్గవ్( Bhargav Ram ) అల్లరి చేస్తూనే తన ప్రతిభతో ఆకట్టుకుంటున్నారని సమాచారం.

తన కొడుకులకు సినిమాలపై ఆసక్తి ఉండి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే తనను మించిన సూపర్ స్టార్స్ అవుతారని తారక్ భావిస్తున్నారని నందమూరి ఫ్యామిలి సన్నిహితుల నుంచి తెలుస్తోంది.

Telugu Abhay Ram, Bhargav Ram, Devara, Jr Ntr, Jr Ntr Cine, Jrntr Fans, Ntr, Nan

కొడుకులు తన పేరును నిలబెట్టేవాళ్లు అవుతారని యంగ్ టైగర్ ఎన్టీఆర్ భావిస్తున్నారు.తారక్ ప్రస్తుతం దేవర సినిమాతో( Devara Movie ) బిజీగా ఉండగా దేవర మూవీ ఆరో షెడ్యూల్ త్వరలో మొదలుకానుంది.దేవర సినిమా ఫ్యాన్స్ మెప్పించే సినిమా అవుతుందని మాస్ ప్రేక్షకులతో విజిల్స్ వేయించే సన్నివేశాలు ఉండనున్నాయని సమాచారం అందుతోంది.

ఎన్టీఆర్ ఈ ఏడాదే వార్ 2 సినిమాతో బిజీ కానున్నారు.

Telugu Abhay Ram, Bhargav Ram, Devara, Jr Ntr, Jr Ntr Cine, Jrntr Fans, Ntr, Nan

వార్ 2 సినిమాలో( War 2 ) తారక్ రోల్ స్పెషల్ గా ఉండనుందని తెలుస్తోంది.తారక్ ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తారక్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీ కావడంతో పాటు ఆ సినిమాలు హిట్ గా నిలిచేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube