బాధ పడకు ఎన్టీఆర్ అన్నా.. మేము తోడున్నాం.. ఫ్యాన్స్ ఎమోషనల్ కామెంట్స్!

బ్యాగ్రౌండ్, టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరూ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారా అనే ప్రశ్నకు ఇండస్ట్రీ నుంచి చెప్పలేమనే సమాధానం ఇస్తుంది.ఆవగింజంత అదృష్టం లేని పక్షంలో సినిమా ఇండస్ట్రీలో ఎంత కష్టపడినా సక్సెస్ అయితే దక్కదనే సంగతి తెలిసిందే.

 Young Tiger Ntr Fans Greatness Details, Young Tiger Ntr, Ntr Fans, Junior Ntr, H-TeluguStop.com

అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉంది.ఎన్నో విమర్శలు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఎన్టీఆర్ ఈ స్థాయికి ఎదిగారు.

కెరీర్ తొలినాళ్లలో ఎన్టీఆర్ కు ఎదురైన అవమానాలు అన్నీఇన్నీ కావు.హరికృష్ణ మినహా నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఎవరి సపోర్ట్ లభించలేదు.ఆ తర్వాత కాలంలో పరిస్థితులు మారాయి.స్టూడెంట్ నంబర్1, ఆది, సింహాద్రి సినిమాల విజయాల తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి తారక్ కు సపోర్ట్ లభించిందనే సంగతి తెలిసిందే.2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం చేశారు.

ఆ సమయంలో యాక్సిడెంట్ అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రచారం విషయంలో వెనుకడుగు వేయలేదు.అయితే తారక్ సపోర్ట్ వల్ల ఆ ఎన్నికల్లో టీడీపీ మెరుగైన ఫలితాలను నమోదు చేసింది.అయితే ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ కు అవమానాలు ఎదురవుతున్నట్టు కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ ఏ విషయం గురించి స్పందించినా కొందరు నేతలు కావాలని వివాదాస్పదం చేస్తున్నారు.

తారక్ కు జరుగుతున్న అవమానాలు అభిమానులు దృష్టికి వస్తున్నా తమ ఫేవరెట్ హీరోను బాధ పెట్టడం ఇష్టం లేక సైలెంట్ గా ఉన్నారు.అయితే తారక్ కు కష్టాలు వస్తే తాము అండగా ఉంటామని వాళ్లు చెబుతున్నారు.తమ హీరోను బాధ పెట్టవద్దని అభిమానులు చేస్తున్న కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొప్పదనానికి, మంచితనానికి ఇతర హీరోల ఫ్యాన్స్ సైతం ఫిదా అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube