ఆ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎంతో అదృష్టవంతుడు.. మరెవరికీ ఆ లక్ లేదంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు( Jr NTR ) గత ఎనిమిదేళ్లుగా కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో కలిసొస్తోంది.వరుస విజయాలు తారక్ రేంజ్ ను పెంచుతుండగా దేవర సినిమా( Devara ) కూడ తారక్ కు మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.2024 సంవత్సరం ఏప్రిల్ నెల 5వ తేదీన దేవర సినిమా థియేటర్లలో విడుదల కానుంది.అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎంతో అదృష్టవంతుడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 Young Tiger Junior Ntr Lucky In That Matter Details, Junior Ntr, Devara Movie, D-TeluguStop.com

దేవర సినిమా రిలీజ్ సమయంలో దాదాపుగా ఏడు రోజుల సెలవులు ఉండటం ఈ సినిమాకు కలిసొస్తోంది.సినిమాకు అబవ్ యావరేజ్ టాక్ వచ్చినా భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమని చెప్పవచ్చు.2024 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీ శుక్రవారం కాగా ఏప్రిల్ 6, 7 తేదీలు సెలవు దినాలు కావడం దేవర మూవీకి ప్లస్ కానుంది.9వ తేదీన ఉగాది పండుగ,( Ugadi ) 10వ తేదీన ఈద్( Eid ) ఉండటం ఈ సినిమాకు కలిసొస్తుందని చెప్పవచ్చు.

13, 14 తేదీలలో సెకండ్ వీకెండ్ కాగా ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి పండుగ( Srirama Navami ) ఉంది.ఈ విధంగా దేవర సినిమా వీక్ డేస్ లో కూడ మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది.జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం వల్ల ఈ డేట్ ను మరో హీరో లాక్ చేసుకోవడానికి ఆసక్తి చూపించలేదు.దేవర సినిమాకు కళ్యాణ్ రామ్ కూడా ఒక నిర్మాత అనే సంగతి తెలిసిందే.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలను సొంతం చేసుకుని బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు నెక్స్ట్ లెవెల్ హిట్లను అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.దేవర సినిమా విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube