పట్టపగలు అందరూ చూస్తుండగా యువకుడి దారుణ హత్య.. అసలు విషయం ఏమిటంటే..?

తెలంగాణలో ( Telangana ) దారుణం.పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ యువకుడుని బండరాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసిన సంఘటన మంచిర్యాల జిల్లా( Mancherial District ) జైపూర్ మండలం ఇందారం గ్రామంలో చోటుచేసుకుంది.

 Young Man Brutally Killed In Mancherial Due To Love Affair Details, Young Man ,k-TeluguStop.com

మహేష్( Mahesh ) అనే యువకుడిని గొంతు కోసి.తలపై బలమైన బండరాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసిన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరూ యువకులు ఉన్నారు.

వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం.స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

వివరాల్లోకెళితే.మహేష్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వెంట పడడంతో పాటు అసభ్యకరంగా ఇష్టం వచ్చినట్లు మెసేజ్లు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిసింది.కానీ ఆ మహిళకు ఇంతకుముందే వివాహం అయింది.యువతి తన పుట్టింట్లో ఉన్న సమయంలో మహేష్ తరచుగా మెసేజ్లు పెట్టేవాడు.ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో కోపంతో ఊగిపోయిన కుటుంబ సభ్యులు మహేష్ గొంతు కోసి.ఓ భారీ బండ తో తలపై దాడి చేసి చంపేశారు.

ఇదంతా ఊర్లో గ్రామస్తులు చూస్తూ ఉండగానే జరగడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు.

బైక్ పై వెళ్తున్న యువకుడి పై దాడి చేసి, హత్య చేయడం కొందరు గ్రామస్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.దీంతో ఈ హత్యకు సంబంధించిన వీడియో రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయింది.మహేష్ మృతి పట్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసుల నిర్లక్ష్యమే కారణమని.

అందుకే మహేష్ బలి అయ్యాడని పోలీసులను ప్రశ్నిస్తూ ఓ వీడియో కూడా బయటకు వచ్చింది.పోలీసులు ఈ హత్య ఘటనపై కేసు నమోదు చేసుకుని ఘటనకు సంబంధించిన వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube