ఆ క్రికెటర్ తో ప్రేమలో ఉన్న ప్రియాంక జవాల్కర్.. ఏం జరిగిందంటే?

తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా ప్రియాంక జవాల్కర్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.టాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ నటి తొలి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

 Young Heroine Priyanka Jawalkar Love Details Here Goes Viral, Love, Priyanka Jaw-TeluguStop.com

తిమ్మరుసు, ఎస్.ఆర్ కళ్యాణమండపం సినిమాలు కూడా నటిగా ప్రియాంక జవాల్కర్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.అయితే ఈ హీరోయిన్ కు సంబంధించి ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ స్టార్ హీరోయిన్ క్రికెటర్ తో ప్రేమలో ఉన్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

గతంలో పలువురు హీరోయిన్లు క్రికెటర్లతో ప్రేమలో పడగా ఈ స్టార్ హీరోయిన్ సైతం అదే దారిలో పయనిస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.యువ క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ తో ఈ యంగ్ బ్యూటీ ప్రేమలో ఉన్నారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం.

కొన్నిరోజుల క్రితం ప్రియాంక సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేసింది.

ఆ ఫోటోకు వెంకటేశ్ అయ్యర్ కామెంట్ చేయగా ప్రియాంక జవాల్కర్ ఆ కామెంట్ కు రిప్లై ఇవ్వడంతో క్రికెటర్ తో ప్రేమలో ఉన్న ప్రియాంక జవాల్కర్ అంటూ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రియాంక జవాల్కర్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను పంచుకున్నారు.ఫోటోలో వ్యక్తిని ప్రియాంక వెనుక నుంచి చూపించడంతో పాటు అతడే అంటూ హార్ట్ ఎమోజీని షేర్ చేశారు.

Telugu Love, Thimmarusu, Youngcricketer-Movie

ఆ వ్యక్తి ఎవరో కాదని వెంకటేష్ అయ్యర్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఈ కామెంట్ల గురించి ప్రియాంక జవాల్కర్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంది.ఈ ఏడాది చాలామంది హీరోయిన్లు పెళ్లి చేసుకుంటున్న నేపథ్యంలో ప్రియాంక జవాల్కర్ కూడా పెళ్లి చేసుకుని వార్తల్లో నిలుస్తారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube