నాగశౌర్య, యుక్తి కాంబినేషన్ లో తెరకెక్కిన రంగబలి ( Rangabali )మూవీకి క్రిటిక్స్ నుంచి యావరేజ్ రివ్యూలు వచ్చాయి.ఫస్టాఫ్ బాగుందని సినిమా సక్సెస్ కు కీలకమైన సెకండాఫ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
సత్య కామెడీ లేకపోయి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరింత ఘోరంగా ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే రంగబలి సినిమా ఫలితం నాగశౌర్యను కూడా హర్ట్ చేసింది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగశౌర్య( Nagashourya ) మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రంగబలి మూవీ 80 శాతం బాగుందని 20 శాతం బాలేదని చెబుతున్నారని ఆ 80 శాతాన్ని ఎంజాయ్ చేయొచ్చుగా అంటూ నాగశౌర్య కామెంట్లు చేశారు.
స్టార్ హీరో మహేష్ బాబు( Mahesh babu ) మాస్ మూవీ ఫ్లాప్ అయితే ఆయనను మళ్లీ మాస్ మూవీ చేయొద్దని చెప్పగలరా అంటూ నాగశౌర్య కామెంట్లు చేశారు.

స్పూఫ్ ఇంటర్వ్యూ వల్ల ఎవరి మనోభావాలు దెబ్బ తినలేదని ఆయన చెప్పుకొచ్చారు.వాళ్లు ఫీలయ్యారని మిగతా వాళ్లు ప్రచారం చేశారని ఆయన వెల్లడించారు.సినిమాలకు సంబంధించి నా ప్రయత్నాలు కొనసాగుతాయని నేను మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తే నా గురించి పాజిటివ్ గా మీరే రాస్తారని ఆయన వెల్లడించారు.
నాగశౌర్య చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తన సినీ కెరీర్ లో నాగశౌర్య ఏకంగా 18 మంది కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చారు.ఇంతమంది కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చిన అరుదైన ఘనత నాగశౌర్యకు మాత్రమే సొంతమవుతుందని చెప్పవచ్చు.తర్వాత ప్రాజెక్ట్ లతో నాగశౌర్య భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు ఫీలవుతున్నారు.
నాగశౌర్య రెమ్యునరేషన్( Remuneration ) 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని భోగట్టా.తర్వాత ప్రాజెక్ట్ లతో నాగశౌర్యకు సక్సెస్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది.







