టాలీవుడ్ యంగ్ జనరేషన్ హీరోలలో ఒకరైన నాగచైతన్య యంగ్ జనరేషన్ స్టార్ హీరోలలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారనే సంగతి తెలిసిందే.చైతన్య నటించిన థాంక్యూ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది.
చైతన్య కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం.థాంక్యూ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చైతన్య మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.రాశి ఖన్నాకు థ్యాంక్స్ చెప్పడానికి ఒక్క ఇంటర్వ్యూ సరిపోదని చైతన్య అన్నారు.వెబ్ సిరీస్ లా ఏడు లేదా ఎనిమిది భాగాలలో ఆ విషయాలను నో థాంక్స్ అని చెప్పాల్సిన సందర్భాలు లైఫ్ లో ఎక్కువగానే ఉన్నాయని చైతన్య కామెంట్లు చేశారు.
అలాంటి సందర్భాలు ఎదురవుతూనే ఉంటాయని చైతన్య వెల్లడించారు.తొమ్మిదో తరగతి చదివే సమయంలో ఒక అమ్మాయిపై నాకు క్రష్ ఉండేదని చైతన్య చెప్పుకొచ్చారు.

నాతో పాటు ఇద్దరు క్లాస్ మేట్స్ కు కూడా ఆ అమ్మాయిపై క్రష్ ఉండేదని చైతన్య కామెంట్లు చేశారు.ఆమె మా ముగ్గురి హృదయాలను బ్రేక్ చేయడంతో మేము ముగ్గురం స్నేహితులుగా మారామని చైతన్య చెప్పుకొచ్చారు.చైతన్య మాట్లాడుతూ నా పాఠశాల రోజులలో ఇంట్లో ఇంగ్లీష్, హిందీ పాటల సీడీలు ఎక్కువగా ఉండేవని చైతన్య కామెంట్లు చేశారు.ఆ ఆల్బమ్ సీడీలలోకి కాపీ చేసి డబ్బులు సంపాదించానని చైతన్య తెలిపారు.
సోషల్ మీడియా అనేది అద్భుతమైన టూల్ అని అయితే సోషల్ మీడియా మన లైఫ్ కాకూడదని లాక్ డౌన్ సమయంలో ఈ విషయం నాకు బోధపడిందని చైతన్య చెప్పుకొచ్చారు.చైతన్య చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
చైతన్య ఫస్ట్ లవ్ సమంత కాదని తెలిసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు.







