అక్కినేని నాగార్జున కొడుకు అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను అందుకుంది.అఖిల్ నటించిన అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాలు ఫ్లాప్ అయినా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సక్సెస్ తో అక్కినేని అభిమానులు సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో అఖిల్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండటం ఒక విధంగా లక్ అయితే మరో విధంగా బ్యాడ్ లక్ అని అఖిల్ అన్నారు.

బ్యాక్ గ్రౌండ్ ఉండటం వల్ల సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చే హీరోలపై విపరీతమైన ఒత్తిడి ఉంటుందని అఖిల్ పేర్కొన్నారు.టాప్ స్టార్ యొక్క మనవడు అయినా, టాప్ స్టార్ యొక్క కొడుకు అయినా సినిమాపై విపరీతమైన అంచనాలు పెరుగుతాయని అఖిల్ వెల్లడించారు.ఆ అంచనాలను అందుకోవాలంటే ఎంతో కష్టపడాలని అఖిల్ పేర్కొన్నారు.ప్రస్తుతం తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతున్నానని అఖిల్ వెల్లడించారు.
తాను సినిమా రంగం నుంచి వచ్చిన వాడినని అందువల్లే తాను ఎక్కడివరకు వెళ్లగలనో ఎంతవరకు వెళ్లగలనో నిర్ణయం తీసుకొని శ్రమిస్తానని అఖిల్ అన్నారు.ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో తాను నటిస్తున్నానని ఈ సినిమాలో తాను గూఢఛారి ఏజెంట్ పాత్రలో నటిస్తానని అఖిల్ వెల్లడించారు.
ఏజెంట్ మూవీ యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతోందని అఖిల్ అన్నారు.

ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిల్ ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం.అఖిల్ ఏజెంట్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.ధృవ, సైరా నరసింహారెడ్డి సినిమాలతో సక్సెస్ ను అందుకున్న సురేందర్ రెడ్డి ఏజెంట్ సినిమా సక్సెస్ విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
సినిమాసినిమాకు క్రేజ్ పెంచుకుంటున్న అఖిల్ ఏజెంట్ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకుంటాడేమో చూడాల్సి ఉంది.