ఉన్నప్పటికీ ప్రస్తుతం మరి కొంత మంది కొత్త డైరెక్టర్లు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు.అయితే అందులో కొందరు ఫస్ట్ సినిమాతోనే ప్రూవ్ చేసుకొని సక్సెస్ లు అందుకుంటుంటే మరికొందరు మాత్రం కొన్ని కారణాలవల్ల ఫస్ట్ సినిమాతో ఫెయిల్ అయి సెకండ్ సినిమాతో గాని,థర్డ్ సినిమాతో గాని మంచి విజయాలను అందుకుంటున్నారు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయి రెండో సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ డైరెక్టర్లు ఎవరో ఒక్కసారి మనం తెలుసుకుందాం…
మొదటగా ఈ లిస్టులో విఐ ఆనంద్ ని( VI Anand ) తీసుకోవాలి ఈయన మొదటి సినిమాగా సందీప్ కిషన్ హీరోగా టైగర్( Tiger Movie ) అనే సినిమాని తీశారు అది ఫ్లాప్ అయింది.
అయినప్పటికీ ఆయన నిఖిల్ ని హీరోగా పెట్టి తన రెండవ సినిమాగా ఎక్కడికి పోతావు చిన్నవాడా( Ekkadiki Pothavu Chinnavada ) అనే సినిమా చేశాడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది దాంతో విఐ ఆనంద్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు.

ఆ తర్వాత ఆయన ఒక్క క్షణం,డిస్కో రాజా అనే సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.అందుకే ఇప్పుడు మళ్ళీ సందీప్ కిషన్ ని హీరోగా పెట్టి ఊరి పేరు భైరవకోన అనే ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా మంచి సక్సెస్ ని అందుకొని మళ్లీ డైరెక్టర్ గా ఒక మంచి స్థాయికి వెళ్లాలని విఐ ఆనంద్ కోరుకుంటున్నారు…

ఇక లిస్టులో మనం చెప్పుకునే మరో డైరెక్టర్ ఓంకార్( Director Omkar ) ఆయన తీసిన మొదటి సినిమా అయిన జీనియస్ సినిమా ప్లాప్ అయినప్పటికీ, ఆ తర్వాత ఆయన తమ్ముడు అయిన అశ్విన్ బాబుని హీరోగా పెట్టి చేసిన రాజు గారి గది సినిమా( Raju Gari Gadhi Movie ) సూపర్ హిట్ అయింది.దాంతో ఆయన రాజు గారి గది సినిమా కి సీక్వెల్ గా కూడా సినిమాలు చేశారు.అయితే ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు ప్రస్తుతం ఒక స్టార్ హీరో తో సినిమా చేయడానికి ఓంకార్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది…
.