కొత్త డైరెక్టర్లు.. పెద్ద ప్రొడ్యూసర్.. భలే కాంబినేషన్స్?

ఒకప్పుడు కేవలం స్టార్ డైరెక్టర్లు స్టార్ హీరోల సినిమాలను మాత్రమే ప్రొడ్యూస్ చేసేవారు నిర్మాతలు.

కానీ ఇప్పుడు మాత్రం కథ బాగుండాలి కానీ కొత్త దర్శకుల సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేసేందుకు సిద్ధమైపోతున్నారు.

దీంతో అప్పుడప్పుడే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్న వారు సైతం తమ కథతో నిర్మాతలను మెప్పించి పెద్ద బ్యానర్లో సినిమాలు చేస్తూ ఉండటం గమనార్హం.ఇలా ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇస్తున్న ఎంతోమంది దర్శకులు పెద్ద బ్యానర్లలో పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ తన కలల్ని నిజం చేసుకుంటున్నారు అని చెప్పాలి.

తెలుగు హీరో నిఖిల్ తో కార్తికేయ సినిమాలు చేసిన దర్శకుడు చందు మొండేటి కి ఒక మంచి ఆఫర్ వచ్చింది.పెద్ద నిర్మాణ సంస్థ గా కొనసాగుతున్న గీతాఆర్ట్స్ తెలుగు తమిళ్ హిందీ లో రిలీజ్ చేసె ఒక సినిమా ఆఫర్ ఇచ్చింది.

కార్తికేయ 2 కంప్లీట్ చేసిన తర్వాత త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది అన్నది తెలుస్తుంది.ఈ సినిమాలో హీరో ఎవరు అన్నది మాత్రం ఇంకా బయటికి రాలేదు.

Advertisement

మళ్ళీరావా, జెర్సీ లాంటి సినిమాలతో ప్రేక్షకుల నాడి పట్టుకున్న గౌతమ్ తిన్ననూరి టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ లో కొనసాగుతున్న యు.వి.క్రియేషన్స్ నుంచి ఛాన్స్ కొట్టేశాడు.

సాహో రాధేశ్యాం లాంటి భారీ బడ్జెట్ సినిమాలు చేసిన యు.వి.క్రియేషన్స్ ఇక ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి తో రామ్ చరణ్ కాంబినేషన్లో ఒక సినిమాకు రెడీ అయిందని తెలుస్తోంది.ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

అయితే ఇటీవలి కాలంలో యువ డైరెక్టర్లకు మంచి ఛాన్సులు ఇచ్చే నిర్మాణ సంస్థ గా మారిపోయింది మైత్రి మూవీ మేకర్స్. కథ బలంగా ఉంది అంటే కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధమైపోతున్నారు దిల్ రాజు.

అశ్వత్ మారిముత్తు అనే కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడు.విశ్వక్సేన్ హీరోగా తెరకెక్కుతున్న ఓరి దేవుడా అని ఇంట్రెస్టింగ్ మూవీ ని వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు దర్శకుడు అశ్వత్.ఇక మురళి కిషోర్ అనే యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చింది గీతాఆర్ట్స్.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

ఎస్ ఆర్ కళ్యాణమండపం తో ప్రేక్షకులను మెప్పించిన ఈ దర్శకుడు గీత ఆర్ట్స్ బ్యానర్ లో వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు