నువ్వు ఎప్పటికీ సింగిల్ గా ఉండిపోతావ్... హీరోకి షాక్ ఇచ్చిన నెటిజన్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి రాజావారు రాణివారు సినిమా ద్వారా అడుగుపెట్టి అనంతరం హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో నటుడు కిరణ్ అబ్బవరం ఒకరు.ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

 You Will Remain Single Forever The Netizen Who Shocked The Hero ,geetha Arts ,ka-TeluguStop.com

ఈ సినిమా శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఫిబ్రవరి 17వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.

ఇక ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన కశ్మీర పర్ధేశీ హీరోయిన్ గా నటించగా ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్నారు.ఈ సినిమా ద్వారా మురళీ కిషోర్ అబ్బురు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇక ఈ సినిమా 17వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు.

ఈ క్రమంలోనే నటుడు కిరణ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.

ఇలా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తున్న ఈయనకు ఒక నెటిజన్ దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు.ఈ సందర్భంగా నెటిజన్ కిరణ్ అబ్బవరాన్ని ప్రశ్నిస్తూ.అన్న నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అని ప్రశ్నించాడు.

 ఇలా ప్రశ్నించడమే కాకుండా వెంటనే ఈ ప్రశ్న నువ్వు చూసి కూడా రిప్లై ఇవ్వకపోతే నువ్వు ఎప్పటికీ సింగిల్ గానే ఉండిపోతావు అంటూ చెప్పుకొచ్చారు.ఇది చూసిన నటుడు కిరణ్ అబ్బవరం ఒక్కసారిగా షాక్ అవుతూ ఏంటి తమ్ముడు అంతమాట అన్నావ్ అంటూ రీప్లే ఇచ్చాడు.

ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube