టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు.ఇలా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ఈయనకు విపరీతమైన అభిమానులు పెరిగిపోయారు.
ఇక ప్రభాస్ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇక ఈయనకు మిలియన్స్ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న విషయం మనకు తెలిసిందే.
ప్రభాస్ కూడా తన అభిమానుల పట్ల ఎంతో అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు.
ఇక ప్రభాస్ అభిమానుల పట్ల చూపించే ప్రేమ అభిమానాలు ఎన్నోసార్లు బయటపడ్డాయి.
ఇక ప్రభాస్ అందరు హీరోలు మాదిరిగా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా కూడా ఉండరు.ఈయన సోషల్ మీడియాలో చేసే పోస్టుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఈయనకు మాత్రం మిలియన్ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారు.
ఇలా మిలియన్ సంఖ్యలో ఫాలోవర్స్ కలిగి ఉన్న ప్రభాస్ ఇంస్టాగ్రామ్ లో కేవలం 16 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు.

ఈ పదహారు మంది కూడా కేవలం తన సినిమాలకు పని చేసిన డైరెక్టర్లు, ఇతర నటీనటులని మాత్రమే తెలుస్తుంది.ఇక ప్రభాస్ ఫాలో అయ్యే వారిలో మన టాలీవుడ్ స్టార్ హీరోలైనటువంటి చరణ్, బన్నీ, తారక్ వంటి వారు లేకపోవడం గమనార్హం.ఈయన కేవలం తన సినిమాలకు పని చేసిన డైరెక్టర్లు, హీరోయిన్లను మాత్రమే ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది.
ఇక ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత నటించిన ఏ సినిమాలు పెద్దగా ఆదరణకు నోచుకోలేకపోయాయి.వచ్చే ఏడాది ప్రభాస్ సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి.







