మనలో చాలా మందికి డ్రైవింగ్ ఫోబియా ఉంటుంది.దానికి ఏకైక కారణం… టూవీలర్ నడిపేటప్పుడు బ్యాలెన్స్ చేయలేకపోవడం.
అవును, అందువల్లనే చాలామంది డ్రైవింగ్ విషయంలో ఎదుటివాళ్లమీద ఆధార పడుతూ వుంటారు.అలాంటివారు ఇపుడు చెప్పబోయే విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు.
ఇపుడు మార్కెట్లోకి వాటంతట అవే బ్యాలెన్స్ చేసుకొనే స్కూటర్లు రాబోతున్నాయి.కాబట్టి ఇకనుండి డ్రైవింగ్ ఫోబియా వున్న వారు భయపడాల్సిన అవసరం లేదు.
మీరు విన్నది నిజమే.ప్రపంచంలోనే అలాంటి తొలి సెల్ఫ్ బ్యాలెన్స్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను పరిచయం చేస్తోంది ముంబై కి చెందిన లైగర్ మొబిలిటీ.
అంతేకాకుండా ఈ స్కూటర్ ఫీచర్స్ ఒకసారి గమనిస్తే మీరు దాని ఫాన్స్ అయిపోతారు.సెల్ఫ్ పార్కింగ్ టెక్నాలజీ ఒకటి ఈ స్కూటర్ లో వుంది.త్వరలో జరగనున్న ఆటో ఎక్స్ పో 2023లో ఈ స్కూటర్ ను ప్రదర్శించున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.2019లోనే ఈ స్కూటర్ గురించి ప్రకటన వచ్చినప్పటికీ అది పూర్తయ్యి మార్కెట్లోకి వచ్చేందుకు తాజాగా సిద్ధమైంది.ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించడానికి ముందు స్కూటర్ కు సంబంధించిన ఫొటోలు బయటకు లీక్ కావడం కొసమెరుపు.

ఈ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ లైగర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లేటెస్ట్ ఫీచర్లతో రెట్రో స్టైలింగ్‌ను సైతం మిళితం చేస్తుంది.చూడటానికి అచ్చం చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్, వెస్పాలా ఇది కనిపిస్తుంది.

ఈ లైగర్ ఎలక్ట్రిక్ స్కూటర్ విశాలమైన సీట్, టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్ ఫోర్క్ తో డిజైన్ చేయబడింది.అలాయ్ వీల్స్‌తోపాటు ముందు డిస్క్ బ్రేక్, బ్యాక్ చక్రానికి డ్రమ్ బ్రేక్ కూడా అమర్చబడి వుంది.మొత్తం దేశీయ టెక్నాలజీతోనే డెవలప్ చేసిన ఈ స్కూటర్ త్వరలో రోడ్లమీద పరుగెడుతుందని స్కూటర్ తయారీదారు సంస్థ లైగర్ మొబిలిటీ చెబుతోంది.
సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఫీచర్ వల్ల నడిపే వారికి సెఫ్టీ, బెస్ట్ రైడింగ్ అనుభవం లభిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.







