గూగుల్ మ్యాప్స్ ద్వారా కలిగే ఉపయోగాలు మనందరికీ తెలిసిందే.మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలన్నా, షార్ట్ కట్ మార్గాల ద్వారా కొత్త ప్రాంతాలకు చేరుకోవాలన్నా గూగుల్ మ్యాప్స్ ఎంతో ఉపయోగపడుతుంది.
ఉద్యోగులు, వ్యాపారులు, ఉద్యోగాల కోసం వెతికే విద్యార్థులు గూగుల్ మ్యాప్స్ పైనే ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు.తాజాగా గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై గూగుల్ మ్యాప్స్ ద్వారా కరోనా డేటా తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది.
గూగుల్ మ్యాప్స్ ద్వారా ఇకపై ఏయే దేశాల్లో ఏయే ప్రాంతాల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయనే విషయాలను సులభంగా తెలుసుకోవచ్చు.
గూగుల్ అతి త్వరలో యూజర్లకు ఈ ఫీచర్ ను వినియోగించుకునే సదుపాయం కల్పించనుందని తెలుస్తోంది.గూగుల్ కోవిడ్ డేటా లేయర్ ను గూగుల్ మ్యాప్స్ లో యాడ్ చేయడానికి సిద్ధమవుతోంది.
యూజర్లు కరోనా ఇన్ఫో లేయర్ ను క్లిక్ చేసి కరోనా కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను పొందే అవకాశం ఉంటుంది.
అయితే గూగుల్ ఏర్పాటు చేయబోతున్న ఈ లేయర్ కోవిడ్ కేసులను ఏ విధంగా చూపించబోతుందనే విషయాలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.
యూజర్లు ఇకపై గూగుల్ మ్యాప్స్ ద్వారా కరోనా హెల్త్ ఫెసిలిటీస్ కు సంబంధించిన సమాచారాన్ని కూడా సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.గూగుల్ కొన్ని దేశాల్లో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అలర్ట్ ఫీచర్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.