Jai Balayya : ఇది కదా బాలయ్య రేంజ్.. తమిళ సినిమాలో జై బాలయ్య డైలాగ్.. ఎవరూ సాటిరారంటూ?

నందమూరి నటసింహం బాలయ్య బాబు( Balayya Babu ) గురించి మనందరికీ తెలిసిందే.ఈ వయసులో కూడా అదే ఊపుతో వరుసగా సినిమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు.

 Yogibabu Says Jai Balayya In His Latest Movie-TeluguStop.com

మామూలుగా బాలయ్య బాబు సినిమా విడుదల అవుతుంది అంటే చాలు అక్కడ వినిపించే ఒకే ఒక స్లోగన్ జై బాలయ్య.( Jai Balayya ) కాగా ప్రస్తుతం ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు బాలకృష్ణ టైం నడుస్తోంది.

అంతేకాక సందర్భంతో పని లేకుండా జై బాలయ్య అనే పదం వాడుకలోకి బాగా వచ్చేసింది.

నిజానికి హైదరాబాద్ లోనే కాదు బెంగుళూరు, విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో పబ్స్ లో బాలకృష్ణ పాటలు ప్లే చేయిస్తూ జై బాలయ్య నినాదాలు కొట్టడం సర్వసాధారణం అయిపోయింది.అలాగే ఇతర హీరోల సినిమాలకు వెళ్లి జై బాలయ్య నినాదాలు చేయడం కూడా కామన్ గా చూస్తూనే ఉన్నాం.అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది అదేమిటంటే తమిళ్ లో ఒక సినిమాలో కమెడియన్ యోగి బాబు( Comedian Yogi Babu ) చేత జై బాలయ్య అనిపించారు మూవీ మేకర్స్.

థూకుదురై( Thookudurai Movie ) అనే సినిమాలో యోగి బాబు కీలక పాత్రలో నటించారు.హారర్ కామెడీ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ జనవరి నెలలో రిలీజ్ అయ్యి ఒక మాదిరి టాక్ అందుకుంది.

ఈ సినిమాలో యోగి బాబు పాత్ర ఒకసారి మాయమై పోవడానికి జై బాలయ్య అనే నినాదం పలుకుతాడు, ఆ వెంటనే మాయం అయిపోతాడు.నిజానికి ఈ సినిమా రిలీజ్ అయింది జనవరి నెలలోనే అయినా ఓటీటీలోకి ఈ మధ్యనే వచ్చింది.దీంతో ఈ విషయం తెలుగు ప్రేక్షకులు దృష్టి కూడా వచ్చింది.అక్కడ కూడా మా బాలయ్య డామినేషనే అని బాలకృష్ణ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటే మరికొంతమంది తమిళ్ సినీ పరిశ్రమ బాలకృష్ణను ట్రోల్ చేసింది.

ఆ విషయం కూడా అర్థం కాకుండా మన డామినేషనే అంటూ ఎందుకలా చంకల గుద్దుకుంటున్నారు? అంటూ కౌంటర్లు వేస్తున్నారు.మొత్తానికి బాలయ్య బాబు క్రేజ్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube