ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా కుప్పంలో ఆయన భక్త కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
తరువాత కురుబ సామాజిక వర్గంతో చంద్రబాబు సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురబలను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు.
కురబ కులస్తులను ఆర్థికంగా, రాజకీయంగా పైకి తెస్తామని పేర్కొన్నారు.ప్రమాదవశాత్తు గొర్రెల కాపరులు మరణిస్తే రూ.10 లక్షల బీమా అందిస్తామని హామీ ఇచ్చారు.జగన్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు.
వైసీపీ మాటలు కోటలు దాటుతున్నాయన్న చంద్రబాబు చేతలు గేటు దాటడం లేదని విమర్శించారు.వైసీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.