వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.అదేవిధంగా రాష్ట్ర, రీజనల్ వైసీపీ కోఆర్డినేటర్లు, జిల్లా వైసీపీ అధ్యక్షులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
ఈ మేరకు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ భేటీ కానున్నారు.
ఎమ్మెల్యేల పనితీరుపై క్షేత్రస్థాయిలో నివేదికలు సిద్ధం అయ్యాయి.
దీంతో పని తీరు మెరుగుపర్చుకోని ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్ తీసుకోనున్నారు.అదేవిధంగా ఇటీవల పార్టీలో వినిపిస్తున్న అసంతృప్తులు, విభేదాలపై వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది.
ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యేలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.అనంతరం గృహ సారథులుగా నియమితులైన వారి తుది జాబితాను సీఎం జగన్ కు ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు సమర్పించనున్నారు.
అనంతరం గృహ సారథుల భవిష్యత్తు కార్యాచరణపై ఎమ్మెల్యేలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.కాగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గృహ సారథుల నియామకాలు పూర్తైన సంగతి తెలిసిందే.
మరోవైపు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చివరి దశకు చేరుకుంది.