గీతాంజలి మృతి( geetanjali )పై వైసీపీ అసత్య ప్రచారం దుర్మార్గం.సజ్జా అజయ్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం వల్లే మృతి చెందిందన్న అసత్యప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల(Tangirala Sowmya ) సౌమ్య అన్నారు.
మంగళవారం నాడు ఆమె మాట్లాడుతూ…రైలు ప్రమాదం వల్లే గీతాంజలి చనిపోయిందని ఎప్.ఐఆర్ నమోదు చేసిన పోలీసులు మళ్లీ ఆత్మహత్యగా ఎందుకు ఫేక్ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు? గీతాంజలి రైలు ప్రమాదంలో గాయపడింది ఈనెల 7 వ తేదీ.సజ్జా అజయ్( Ajay Sajja ) వీడియో మాట్లాడింది 10 వ తేదీ.గీతాంజలి నిజంగా ఆత్మహత్య చేసుకుంటే 4 రోజులుగా కేసు ఎందుకు నమోదు చేయలేదు? 7 వ తేదీ ప్రమాదం జరిగితే ఇన్ని రోజులు పట్టించుకోని వైసీపీ నేతలు ఆమె చనిపోగానే శవ రాజకీయం మొదలెట్టారు.
సొంత బాబాయిని చంపి గుండెపోటు, నారా వారి రక్త చరిత్ర అంటూ కధలు అల్లిన జగన్ రెడ్డి( YS Jagan Mohan Reddy )కి, వైసీపీ నేతలకు సామాన్య ప్రజల మృతిపై కట్టు కధలు అల్లి ప్రతిపక్ష పార్టీలపై బురద చల్లటం ఓ లెక్కా.శవ రాజకీయాలు చేస్తున్న వైసీపీకి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని సౌమ్య అన్నారు