వైసీపీకి 50 మార్కులే.. ఏ విష‌యంలోనో తెలుసా..?

ఏపీ అధికార పార్టీ వైసీపీకి వంద‌కి 50 మార్కులే ప‌డ్డాయ‌ట‌!  ఈ విష‌యం వైసీపీ నేత‌ల మ‌ధ్య హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవ‌ల కాలంలో రాష్ట్ర ప్ర‌భుత్వానికి జాతీయ స్థాయిలో మంచి మార్కులు ప‌డుతున్న విష ‌యం తెలిసిందే.

మ‌రీముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెడుతున్న అనేక ప‌థ‌కాల‌కు మంచి మార్కులు ల‌భిస్తున్నాయి.అదేస‌మ‌యంలో ఉత్త‌మ సీఎంగా దేశంలోనే నాలుగోస్థానంలో ఉన్నారు జ‌గ‌న్‌.

ఇక‌, దిశ వంటి కీల‌క చ‌ట్టాల‌ను తీసుకువ‌చ్చి మ‌హిళ‌ల విష‌యంలోనూ మంచి మార్కులు సొంతం చేసుకున్నారు.అలాంటి వైసీపీ ప్ర‌భుత్వానికి ఇప్పుడు 50 మార్కులే రావ‌డం చ‌ర్చ‌కు దారితీసింది.

విష‌యంలోకి వెళ్తే.ప్ర‌భుత్వం ఒక‌వైపు సంక్షేమ కార్య‌క్ర‌మాలు, మ‌రోవైపు, కీల‌క ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెడుతూ.

Advertisement

దూకుడుగా ముందుకు వెళ్తోంది.ఈ విష‌యంలో మంచి మార్కులే ప‌డుతున్నాయి.

అయితే.పార్టీ ప‌రంగా చూస్తే.

మాత్రం నాయ‌కుల దూకుడు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.దీంతో ప్ర‌జ‌ల్లో పార్టీపై ఒకింత అస‌హ‌నం క‌నిపిస్తోంది.

మ‌రోవైపు నేత‌ల‌కు, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య చాలా గ్యాప్ పెరిగిపోయింది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!

అన్నీ వాలంటీర్లు చూసుకోవ‌డం, ప్ర‌తి విష‌యం వాలంటీర్లు చేతిలోనే ఉండ‌డంతో నాయ‌కుల‌కు ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య గ్యాప్ పెరిగింది.ఇది ప్ర‌ధానంగా పార్టీకి మైన‌స్‌గా మారింది.ఇదే విష‌యం ఇటీవ‌ల పార్టీ అధినేత జ‌గ‌న్ చేయించిన అంత‌ర్గ‌త స‌ర్వేలో స్ప‌ష్టంగా తెలిసింద‌నేది సీనియ‌ర్ల మాట‌.

Advertisement

ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల కాలంలో ప్ర‌తి కార్య‌క్ర‌మాన్నీ జ‌గ‌న్ ప్ర‌జ‌ల మ‌ధ్య ప్రారంభిస్తుండ‌డం సాధ్య‌మైనంత వ‌ర‌కు నేత‌ల‌ను ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని సూచించ‌డం వంటివి క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు.ఈ నేప‌థ్యంలోనే వంద‌కు 50 మార్కులే ప‌డ్డాయ‌ని చెబుతున్నారు.

మొత్తానికి ప్ర‌భుత్వం బాగుంటే.పార్టీ ప‌రిస్థితి డోలాయ‌మానంలో ప‌డింద‌నే చ‌ర్చ మాత్రం ఆస‌క్తిగామార‌డం గ‌మ‌నార్హం.

తాజా వార్తలు