టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీ విషయంలో గతంలో వైసీపీ ( YCP )కఠినంగా వ్యవహరించి టికెట్ రేట్ల విషయంలో ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే.పెద్ద సినిమాల హక్కులకు సంబంధించి ఏపీ నుంచి ఎక్కువ ఆదాయం వస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరోలు జగన్ ను కలిసి సమస్య పరిష్కారం అయ్యేలా చేశారు.
అయితే బ్రో మూవీలో అంబటి రాంబాబును( Ambati Rambabu ) ఇమిటేట్ చేసేలా శ్యాంబాబు పాత్రను క్రియేట్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సినిమాలో వైసీపీ నేతలను కించపరిచే సన్నివేశాలు ఉండటం అంబటి రాంబాబుకు కోపం తెప్పించింది.ఈ సినిమాలో మరి కొందరు వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ కూడా సీన్లు ప్లాన్ చేశారని అయితే షూట్ పూర్తైనా కొన్ని కారణాల వల్ల ఆ సీన్ల విషయంలో వెనక్కు తగ్గారని భోగట్టా.అయితే ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటల కోసం త్రివిక్రమ్ పని చేశారు.
ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) కు 15 కోట్ల రూపాయల ఆదాయం దక్కింది.అయితే త్రివిక్రమ్ పై పగ తీర్చుకోవడానికి వైసీపీ సిద్ధమైందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
గుంటూరు కారం సినిమా విషయంలో ఏపీ సర్కార్ కఠినంగా వ్యవహరించనుందని తెలుస్తోంది.ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపు లేనట్టేనని టాక్ నడుస్తోంది.
వైసీపీకి మహేష్ పై అభిమానం ఉన్నా త్రివిక్రమ్ వైఖరి వల్ల వైసీపీ ప్రస్తుతం త్రివిక్రమ్ విషయంలో సీరియస్ గా ఉందని తెలుస్తోంది.

సాధారణంగా మహేష్ బాబు ( Mahesh Babu )వివాదాలకు దూరంగా ఉంటారు.ఏ రాజకీయ పార్టీకి మహేష్ బాబు బహిరంగంగా సపోర్ట్ చేయరు.మహేష్ కు క్రేజ్ సైతం అంతకంతకూ పెరుగుతోంది.
గుంటూరు కారం సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.మహేష్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.