మరి కొద్ది నెలల్లో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి.అధికార పార్టీ వైసీపీలో( YCP ) టెన్షన్ పెరిగిపోతుంది విపక్ష పార్టీలన్నీ మూకుమ్మడిగా ఎన్నికలకు వెళ్లి తమను ఓడించాలనే పట్టుదలతో ఉండడంతో, సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయని, ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ద్వారా ఎంతో మేలు జరిగిందని , ఆ కృతజ్ఞతతోనే మళ్లీ తమను గెలిపిస్తానే నమ్మకంతో జగన్( CM Jagan ) ఉన్నారు.
వచ్చే ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి రాబోతుందని అనేక సర్వేలు వెల్లడించడంతో, అసెంబ్లీ సీట్ల విషయంలో పోటీ పెరుగుతుంది .సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు, ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారు , టిడిపి జనసేన నుంచి గెలిచి వైసిపికి అనుబంధంగా కొనసాగుతున్న వారు.వచ్చే ఎన్నికల్లో వైసిపి టికెట్ కోసం పోటీ పడుతున్నారు.

చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సీటు విషయంలో తీవ్రమైన పోటీ నెలకొంది. అయితే ముందుగా ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసి , ఆ తర్వాతే అసెంబ్లీ అభ్యర్థులను ఎంపిక చేయాలని ఆలోచనతో జగన్ ఉండగా ,ఎంపీగా పోటీ చేసేందుకు ఎవరు పెద్దగా ఆసక్తి చూపించడం లేదట.ఎంపీగా( MP ) పోటీ చేయాలంటే భారీగా సొమ్ములు ఖర్చు చేయాల్సి ఉండడం, తిరిగి వాటిని రాబట్టుకునే అవకాశం లేకపోవడంతో చాలామంది సిట్టింగ్ ఎంపీలు సైతం వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదట.
తమకు ఎమ్మెల్యే టికెట్( MLA Ticket ) ఇస్తే చాలు అని అధిష్టానం పై ఒత్తిడి చేస్తున్నారట.గతంలో ఎంపీలుగా పోటీ చేసేందుకు తీవ్రమైన పోటీ ఉండేది.
ఎంపీలకు వివిధ కాంట్రాక్టులు, వివిధ ప్రాజెక్టుల్లో కమిషన్లు , కేంద్రంలో పలుకుబడి, అక్కడ లాభియింగ్ ద్వారా భారీగా లబ్ధి చేకూరడం తదితర కారణాలతో ఎక్కువమంది ఎంపీలుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపించేవారు.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
కేంద్ర మంత్రిత్వ శాఖ ఎంపీ సిపార్సులకు విలువ ఉండడం లేదు.

ప్రస్తుతం ఎంపీలు ఎటువంటి లాభం చేయడానికి కేంద్రం ఆస్కారం ఇవ్వడం లేదు.దీంతో ఎంపీలుగా పోటీ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని, ప్రజల్లోనూ అంత పలుకుబడి ఉండదని , ప్రస్తుతం ఎమ్మెల్యేలకు ఉన్నంత పలుకుబడి ప్రజల్లో ఎంపీలకు లేదనే అభిప్రాయంతో చాలామంది విముక్తి వ్యక్తం చేస్తున్నారట.వైసిపి లోను ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీలు మళ్లీ పోటీ చేసేందుకు ఆసక్తి చూపించకపోవడంతో వైసిపి సీనియర్లను ఎంపీలుగా పోటీకి దింపే ఆలోచనతో జగన్ ఉన్నారట.ఇప్పటికే సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, కురసాల కన్నబాబు, ఆళ్ల నాని, అనిల్ కుమార్ యాదవ్, మహమ్మద్ ఇక్బాల్ తో పాటు మరి కొంత మంది ఎమ్మెల్యేలతో జగన్ చర్చిస్తున్నారు.
ఎంపీ గా పోటీకి చాలామంది ఆసక్తి చూపించడం లేదట.అయితే తప్పనిసరిగా పోటీ చేయాల్సిందేనని జగన్ అల్టిమేటం ఇస్తే తప్ప , మిగతా ఎవరూ అంత ఆసక్తి చూపించడం లేదట.