టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ( Adipurush movie )ఇటీవలే విడుదల అయ్యి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా నెగెటివ్ టాక్ ని, విమర్శలను ఎదుర్కొంది.
భారీ అంచనాల మధ్య జూన్ 16న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సినీ ప్రియులను అంతగా మెప్పించలేకపోయింది.ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
పలువురు సినీ ప్రముఖులు ఆదిపురుష్ చిత్రంపై విమర్శలు చేశారు.కొంతమంది వెంటనే ఈ సినిమాను బ్యాన్ చేయాలి అంటూ కూడా కామెంట్స్ చేశారు.

కాగా ఈ చిత్రానికి ఓం రౌత్( Om raut ) దర్శకత్వం వహించారు.బాలీవుడ్ రచయిత మనోజ్ ముంతశిర్ డైలాగ్స్ రాశారు.పలు వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచిన ఆదిపురుష్ ను రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు.కానీ అభిమానుల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది.అయితే సినిమా విడుదలై దాదాపుగా నెల రోజులు దాటి పోవడంతో ఓం రౌత్ సోషల్ మీడియాలో( Social media ) పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
తనకు ఇష్టమైన ఆలయాలను సందర్శించానని ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు.ఓం రౌత్ ఇన్‌స్టాలో రాస్తూ.శ్రీ మంగేశి దేవాలయం, శ్రీ శాంతదుర్గ దేవాలయం దర్శనం చేసుకున్నాను.,/br>

ఇక్కడికి వచ్చిన తరచుగా నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటా.ఈ రెండు పవిత్ర స్థలాలు నన్ను నా మూలాలకు కనెక్ట్ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.ఈ దేవాలయాలను దర్శించుకుని దీవెనలు పొందాలని నేను ఎల్లప్పుడూ ఉత్సాహంతో ఉంటాను అని పోస్ట్ చేశారు.
ఆ పోస్ట్ చూసిన నెటిజన్స్ ఓం రౌత్ పై ఒక రేంజ్ లో విడుచుకుపడుతున్నారు.కొంతమంది రూ.600 కోట్లను ఆగం చేశావు కదా కామెంట్స్ చేయగా, మరికొందరు అన్నా నువ్వు ఇంకా బతికే ఉన్నావా? అంటూ పోస్టులు పెడుతున్నారు.మొత్తానికి ఓం రౌత్ ఆది పురుష్ సినిమా శాపాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయని తాజాగా షేర్ చేసిన పోస్ట్ ని చూస్తే అర్థం అవుతుంది.







