పార్టీని విమర్శించాడు కాబట్టి షోకాజ్ నోటీస్ ఇస్తే దారిలోకి వస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించింది.ఆ మేరకు నోటీసులిచ్చి హడావుడి చేసింది.
కానీ ఎవరూ ఊహించని విధంగా నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన స్కెచ్ తిరిగి తిరిగి పార్టీకి తీరని నష్టాన్ని చేకూర్చుతూ ఉండడంతో, ఇప్పుడు అనవసరంగా ఆయనతో పెట్టుకున్నామా అనే అభిప్రాయం ఇప్పుడు ఆ పార్టీలో నెలకొంది.షోకాజ్ నోటీసు ఇచ్చిన దగ్గర నుంచి ఆయన మరింత దూకుడుగా వెళుతూ, పార్టీకి ఇబ్బందులు తీసుకురావడంతో పాటు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం తెచ్చేలా వ్యవహరిస్తుండడంతో, ఆయనపై అనర్హత వేటు వేయించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది.
ఇది ఇలా ఉంటే ఆయన మాత్రం కాస్త సైలెంట్ గానే ఉన్నట్టు గా కనిపిస్తున్నారు.తెరవెనుక మాత్రం వైసీపీని దెబ్బకొట్టే విధంగా చేస్తూ కొద్ది రోజులుగా హడావుడి చేస్తుండడంతో ఆయనపై వైసిపి పూర్తిస్థాయిలో నిఘా పెట్టింది.
ఆయన కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వస్తోంది.
పార్టీ నుంచి తానొక్కడినే బయటకు వెళ్లడమే కాకుండా, తనతో పాటు వైసీపీలో ఉన్న అనేక మంది అసంతృప్తి వాదులను ఏకం చేసి, వారందరినీ బయటకు తీసుకువెళ్లి వైసిపి ఊహించని విధంగా దెబ్బకొట్టాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.
ఇప్పటికే వైసీపీపై తిరుగుబావుటా ఎగురవేసినట్టుగా వ్యవహరిస్తూ, పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తో రఘురామకృష్ణంరాజు సెల్ఫీ దిగడం, వైసీపీని కవ్వించే ప్రయత్నాల్లో భాగంగానే అని తెలుస్తోంది.వీరు కాక అనేక మంది అసంతృప్తులు ఇప్పుడు రఘురామకృష్ణరాజు బాటలో వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

వీరందరికీ నాయకత్వం వహిస్తూ, బిజెపిలో చేర్చే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వైసిపి భావిస్తోంది.బిజెపి అధిష్టానం రఘురామకృష్ణంరాజు కు పూర్తిగా మద్దతు ఇస్తూ వస్తున్నట్టుగా కనిపించడం, వారి అండతోనే ఇంతగా దూకుడుగా వెళ్తున్నారని వైసిపికి సమాచారం అందింది.ఇక రఘురామ కృష్ణం రాజు పై అనర్హత వేటు విషయంలో బిజెపి పట్టించుకోనట్టు వ్యవహరిస్తుండడంతో ఆయన దూకుడుకు కళ్లెం వేయాలనే దానిపై వైసిపి కసరత్తు చేస్తోంది.ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే పార్టీపై అసంతృప్తితో ఉన్నట్టుగా కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
ఆయన కూడా బీజేపీలో చేరితే ఎలా ఉంటుందనే విషయంపై కొద్ది రోజులుగా ఆలోచనలతో ఉండడంతో ఆయన పైనా, దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.తాను ఒక్కడినే వెళ్లడం వల్ల వైసీపీకి పెద్దగా నష్టం ఉండదని, వెళ్తూ వెళుతూ పెద్దఎత్తున నాయకులను తన వెంట తీసుకెళితే వైసీపీకి తీరని నష్టం కలిగించడంతో పాటు, బీజేపీలో తన పలుకుబడి పెరుగుతుందనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లుగా ప్రస్తుత వ్యవహారాలు చూస్తే అర్థమవుతుంది.