మండ‌పాల్లో పార్టీ రంగులు..! ఇక వాళ్ల‌కు చేతినిండా ప‌నే..!!

అధికార పార్టీ వైసీపీ ఏపీలో దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.ఏం చేసినా చెల్లుతుద‌నే కాన్ఫిడెంట్ తో కూడా ఉన్నారు.

 Ycp Party Colors In Ganesh Mandapams Bjp Leaders Criticizing Details, Ycp Gover-TeluguStop.com

దేని గురించీ బాధ‌లేదు.ఇక త్వ‌ర‌లో దేశమంత‌టా వినాయక చవితి సంబరాలు ప్రారంభం కానున్నాయి.

అయితే ఏపీలో ఇవి సాదాసీదాగా నిర్వహిస్తే బాగుంటుందని అనుకున్నారో.ఏమో.! వైసీపీ నాయకులు దీనికి పార్టీ కలర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలోనే వైసీపీ ఆధ్వర్యంలో నిర్వ హించే గణపతి మందిరాల్లో ఏర్పాటు చేసే వినాయకుడి ప్రతిమలకు పార్టీ రంగులు పూసేశారు.

పైనుంచి వచ్చిన ఆదేశమో.లేక పైవారిని మెప్పించాలనే ప్రయత్నమో తెలియదు కానీ.

మొత్తానికి విగ్రహానికి భ‌క్తితో పార్టీ రంగులు పూసేశారు.మ‌రి ఇది చూస్తూ రాష్ట్ర బీజేపీ నాయకులు ఊరుకోరు క‌దా.

రంగులు పూసిన వేళ‌.

ఎప్పుడెప్పుడు చాన్స్ దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న బీజేపీ నాయకులకు.వైసీపీ నాయకులు చేతినిండా అందించిన పనిగానే చెప్పుకోవచ్చు.సాధారణంగా ఇతర ఆఫీసు లకు రంగులు వేస్తేనే విమ‌ర్శ‌లు చేసిన బీజేపీ నాయకులు.గణనాయకుడు. తొలి పూజలు అందుకునేవాడు.అయిన.గణపతికి ఇలా రంగులు పూస్తే ఊరుకుంటారా.? అంత ఈజీగా వ‌దిలిపెడ‌తారా.ఎలాగూ యాగీ చేయ‌క త‌ప్ప‌దు కాబట్టి.

Telugu Bjp, Cmjagan, Ganesh, Jagan, Somu Veerraju, Ycp, Ycp Colors-Political

బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు పరివారానికి వైసీపీ నాయకులు చేతినిండా పనిక ల్పించారనే అంటున్నారు పరిశీలకులు.ఇక బీజేపీ వారు మాత్రం కాదనేది ఏముంటుంది.రాజ‌కీయంగా పుంజుకోవ‌డానికి వాయిస్ వినిపించ‌డానికి మంచి చాన్స్ దొరికిన‌ట్టే క‌దా.! ధర్నాలు.

రాస్తారోకోలు.సవాళ్లు.

ప్రతిసవాళ్లతో ఏపీ అట్టుడికిపోవడం.మీడియాకు కూడా ప‌ని క‌ల్పించ‌డం మొద‌లైన‌ట్లే ఇక‌.పండ‌గ సంబురాల‌కు కాస్తా రాజ‌కీయ రంగు పులుముకుంటున్న‌ట్లు క‌నిపిస్తోంది.దినిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో… వైసీపీ నేత‌లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి మ‌రి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube