చంద్రబాబుకి బెయిల్ రావడం పట్ల వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు..!!

స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి( Chandrababu Naidu ) పూర్తిస్థాయి బెయిల్ ఏపీ హైకోర్టు మంజూరు చేయటం జరిగింది.దాదాపు 53 రోజులపాటు ఈ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు గత నెల మధ్యంతర బెయిల్ మీద విడుదల కావడం జరిగింది.

 Ycp Mp Raghuramakrishna Raju Sensational Comments On Chandrababu Getting Bail De-TeluguStop.com

అయితే ఇప్పుడు పూర్తిస్థాయి బెయిల్ రావటంతో తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు.ఇదిలా ఉంటే చంద్రబాబుకి బెయిల్ రావడం పట్ల వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు( YCP MP Raghuramakrishna Raju ) సోషల్ మీడియాలో స్పందించారు.చంద్రబాబు గారికి పూర్తిస్థాయి బెయిల్ తో న్యాయానికి పట్టాభిషేకం.29వ తేదీ నుంచి ఎటువంటి షరతులు లేకుండా ఆయన అన్ని రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనవచ్చు.

Telugu Ap, Chandrababu, Cmjagan, Ambati Rambabu, Ycpmp-Latest News - Telugu

అన్ని రంగాలలో ఆంధ్ర రాష్ట్రాన్ని అట్టడుగు పాలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి( Jagan ) గారిదే.గత ప్రభుత్వ హయాంలో నంబర్ వన్ స్థానంలో ఉన్న డిస్కంలు.ఇప్పుడు 40వ స్థానానికి పడిపోయాయి.చట్టాన్ని తుంగలో తొక్కి ఒకరిద్దరి లబ్దికోసం అడ్వాన్సులు ఇస్తామంటే ప్రజలు సహించరు.ఇంకా అనేక విషయాలపై వైసీపీ ప్రభుత్వం పై రఘురామకృష్ణ రాజు మండిపడ్డారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చారు.

పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందో.నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పలేకపోతున్నారని విమర్శించారు.

Telugu Ap, Chandrababu, Cmjagan, Ambati Rambabu, Ycpmp-Latest News - Telugu

ఋషికొండపై ముఖ్యమంత్రి గారి నివాస క్యాంపు కార్యాలయ సముదాయ నిర్మాణానికి. 443 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించారని వాటికి సంబంధించిన జీవోలు అన్నిటిని బహిర్గతం చేయాలని.న్యాయస్థానం తెలపడంతో.జీవోలు వెలుగులోకి వచ్చాయని అన్నారు.ఒక వ్యక్తి తన విలాసం కోసం ప్రభుత్వ ఖజానా దుర్వినియోగం చేస్తున్నట్లు పరోక్షంగా సీఎం జగన్ పై విమర్శలు చేశారు.ఇక ఇదే సమయంలో ఒత్తిడి తట్టుకోలేక.

భారత్ వరల్డ్ కప్ మ్యాచ్ లో ఓడిపోయినట్లు స్పష్టం చేశారు.ఇంకా అనేక విషయాలపై వైసీపీ ప్రభుత్వంపై రఘురామకృష్ణ రాజు మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube