సర్వేలతో వైసీపీ నేతల్లో ముసలం

ప్రస్తుత రాజకీయాల్లో సర్వేలు ఒక బ్రహ్మ పదార్థంగా మారాయి.ఏ పదవి ఇవ్వాలన్న సర్వేల ఆధారంగానే కట్టబెడుతున్నారు.

 Ycp Mlas Leaders Tension With Political Surveys Details, Ycp, Jagan, Ycp Mlas ,-TeluguStop.com

ఈ సర్వేలు ఎవరు చేస్తున్నారు అన్నది పార్టీలో ఉన్న నాయకులకు ఒక సందేహంగా మారింది.దీంతో వైసీపీ శిబిరంలో సర్వేలు అంటేనే ఎమ్మెల్యేలు, నాయకుల గుండెల్లో గుబులు పుడుతుంది.

ఏపీలో హీటెక్కిన సర్వేల రాజకీయం

వైసిపి అధికారపక్షం ఎమ్మెల్యేల పనితీరుపై వరుసబెట్టి సర్వేలు నిర్వహిస్తోంది.దీంతో నాయకులు, ఎమ్మెల్యేలు ఆ సర్వేలపై మండిపడుతున్నారు.

సర్వేలకు ఉన్న విశ్వసనీయత ఎంత అని వారు ప్రశ్నిస్తున్నారు.చివరకు వైసిపి అధినాయకత్వంపై ఎమ్మెల్యేలకు విశ్వసనీయత సన్నగిల్లే పరిస్థితి కనిపిస్తుంది.

ఎమ్మెల్యేల మీటింగ్ లో వారి పనితీరు బాలేదని, ఇంకా మెరుగుపరుచుకోవాలని వరుసపెట్టి క్లాసులు పీకుతుంది అధిష్టానం .దీంతో ఈ సర్వేలు నిర్వహించేది ఎవరు అన్నది అర్థం కాకా తలలు పట్టుకుంటున్నారు ఎమ్మెల్యేలు.కొందరైతే మాదారి మేము చూసుకుంటాం మహాప్రభో అనే స్థాయికి వచ్చేశారు.ఇటీవల వైసిపి అధినాయకత్వం గడప గడప కార్యక్రమంపై సర్వే నిర్వహించింది అయితే గ్రౌండ్ రియాలిటీ చాలామంది ఎమ్మెల్యేలకు తెలుసు కాబట్టి ఆ కార్యక్రమానికి చాలామంది డుమ్మా కొట్టారు.

ఆంధ్రప్రదేశ్ లో కేవలం 15 మంది మాత్రమే గడప గడప కార్యక్రమాన్ని సీరియస్ గా చేశారు.ఒక యాభై మంది మాత్రం ఒక్క రోజు కూడా గడపగడపకు కార్యక్రమానికి వెళ్లలేదని సమాచారం.

మిగిలిన వారు మొక్కుబడిగా అప్పుడప్పుడు కార్యక్రమాలు నిర్వహించారు అని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి.

Telugu Cmjaganmohan, Gadapagadapaku, Intelligence, Ipac, Jagan, Surveys, Private

వైసిపి అధినాయకత్వం దగ్గర ఐప్యాక్ సర్వే, ఇంటలిజెన్స్ సర్వే, ప్రైవేట్ సర్వే లాంటి మూడు సర్వేలతో ఎమ్మెల్యేల పనితీరును తెలుసుకున్నారు.ఇందులో ఎమ్మెల్యేల పనితీరు చాలా అధ్వానంగా ఉందని తేలింది.ఇదిలా ఉంటే తమ పని చేసుకోకుండా ఈ సర్వేల గోల ఏంటి అని కొందరు ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.

మరికొంతమంది ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు అయింది మరో రెండు సంవత్సరాల మిగిలి ఉందని ఈ లోపు మా పనితీరు మార్చుకుంటాము అని కూడా బహిరంగంగానే చెబుతున్నారు.ఇదే ఈ మూడు సంవత్సరాల ఫైనల్ కాదు కదా అని అంటున్నారు.

సర్వే ఆధారంగా వచ్చే ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తే తమ దారి తాము చూసుకుంటామనే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.మొత్తానికి సర్వేలతో వైసిపి శిభిరంలో ముసలం మొదలైందని ప్రతిపక్షాలు అంటున్నాయి.

ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube