వైఎస్సార్సీపీ విధానాలను తప్పు పట్టలేని స్థితిలో ప్రతిపక్షాలు ఉన్నాయి - మాజీ మంత్రి పేర్ని నానీ

తాడేపల్లి: మాజీ మంత్రి పేర్ని నానీ కామెంట్స్.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ ఏర్పాటుకు కారణమైన ప్రతి కార్యకర్తలు దిశా నిర్దేశం చేశారు.వారి అంకిత భావంతో చేసిన యజ్ఞం ఫలితంగా ప్రజా ప్రభుత్వం పరిపాలన చేస్తోంది.95 శాతం మేనిఫెస్టో హామీలను అమలు చేయడంతో పాటు ఇవ్వని హామీలను అమలు చేశారు.విద్యా, వైద్యంలో మార్పులకు శ్రీకారం చుట్టి మిగతా రాష్ట్రాలు మనవైపు చూసేలా చేశారు.ప్రతి కార్యకర్త జోరు వానలో తడిసినా సరే అంకితభావంతో పాల్గొన్నారు.ప్రతి ఒక్క కార్యకర్తకు హృదయపూర్వక కృతజ్ఞతలు.వైఎస్సార్సీపీ విధానాలను తప్పు పట్టలేని స్థితిలో ప్రతిపక్షాలు ఉన్నాయి.

 Ycp Mla Perni Nani Fires On Ap Opposition Leaders Details, Ycp Mla Perni Nani ,-TeluguStop.com

నెలలో రెండు ఆదివారాలు వీకెండ్ ప్రజాసేవ చేయడానికి ఓ నాయకుడు వస్తున్నాడు.అప్పుడు నా జీవితం ప్రజలకు అంకితం అన్నాడు…డబ్బుల కోసం మళ్లీ సినిమాలు అన్నాడు.

ఇలాంటి రాజకీయ నాయకుడి పోకడలు చరిత్రలో రాయాల్సిందే.షూటింగులకు ఆలస్యం అనుకుంటే రాజకీయాలకు ఆలస్యమే.

లోక్ నాయక్ జయప్రకాష్ స్టేట్ మెంట్ ప్రజలు ఎప్పుడో తెలుసుకున్నారు.మిమ్మల్ని అసెంబ్లీ గేటు తాకనివ్వంది మేము కాదు…భీమవరం, గాజువాక ప్రజలు.

ప్రతి దానికీ జగన్మోహన్ రెడ్డి ఆయనకు దోషిగా కనిపిస్తాడు.ప్రతిపక్షంలో ఉన్నా…అధికారంలో ఉన్నా జగన్ నే ప్రశ్నిస్తాడు.

నిన్ను గేటు ముట్టుకోవాలా వద్దా అనేది ప్రజల చేతుల్లో ఉంది.చిలక జోస్యం ప్రావీన్యులు మీరు…జగన్ సీఎం కాలేడ్డు అని చెప్పింది మీరేగా.

జగన్ ఎప్పుడూ ప్రజల్ని నమ్ముకుంటాడు…నీ లాగా చంద్రబాబు, మొడీలను నమ్ముకొడు.ఈయన ప్రవచనాలకు చాగంటి కోటేశ్వరరావు కూడా సరిపొడు.

నిన్నేమీ చెప్పానో నేడు ఏమీ మాట్లాడుతున్నానో ఆయనకి గుర్తుండదు.అమలాపురం ఘటన జరగగానే కోనసీమకు అంబేడ్కర్ పేరు ఎందుకు పెట్టాలి అన్నది ఈయన కాదా.ఈ రోజు ఆ పేరు పెడితే సంతోష పడేది నేనే అంటాడు.ఆ రోజు మంత్రి, ఎమ్మెల్యే ఇల్లు కాల్చితే సేటైర్లు వేసి…ఈ రోజు ప్రవచనాలు చెప్తున్నాడు.

రేణిగుంటలో అనిత ఆమెకు న్యాయం జరిగింది అన్నా విషయం సాయంత్రానికి సినిమా మారింది.ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్ముతున్నడు.

ఈయన పోటు గాడు అని రౌడీఇజం సహించడట…అనంతలో మీరు ఎవరి ఇంటికి వెళ్ళి కాఫీ తాగిన వాళ్ళు ఎవరు.నువ్వు సొల్లు కబుర్లు చెప్తే భగవద్గీత లా మేము చదువుకోవాలి.

సత్తెనపల్లిలో ఎంపీటీసీలను దారికాసి దాడి చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ నోరు ఏమైంది.నాకు మతం లేదు అంటాడు…బాప్తిసం ఇచ్చారు అంటాడు.

పచి హిందువును అంటాడు.బండేనక బండి కట్టి తిరుగుతున్నావు కదా…నువ్వు కొన్నావో.

ఎవరూ కొన్నారో.

నీ ఆర్ధిక మూలాలపై దెబ్బకొట్టాము అంటాడు… వకీల్ సాబ్ పై దెబ్బ కొట్టింది ప్రజలు కదా.ఆ నష్టాల వల్ల మీరు తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చారా.కుల భావం చచ్చిపోయింది అని బాధపడటం ఏమిటి…?.మీ ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుంచి మీరు మాట్లాడిన వన్నీ చూస్తే మీపై మీకే అసహ్యామేస్తుంది.ఊసరవెల్లి సినిమా మీరు చేయాల్సింది…పొరపాటున జూనియర్ ఎన్టీఆర్ చేశాడు.తునిలో కాపు ఉద్యమం సంఘటనలు జరిగినప్పుడు కాపులు రిజర్వేషన్లు ఏమిటి అంటూ మీరు మాట్లాడలేదా.?.ఈయన నయా వివేకానందుడు.ఈయనకు రాజకీయం కావాలి…అది చంద్రబాబుకి ఉపయోగపడాలి…ఆయన కోసం కాపులు కావాలి.

చంద్రబాబుల నేను కాపు ద్రోహిని కాలేను.రిజర్వేషన్లు నేను చేయలేను అని జగన్ చెప్పారు.

వారి ఆర్ధిక స్వావలంబన కోసం కృషి చేస్తానని చెప్పారు.నేను కాపుని కాదు మనిషిని అన్నావు…మరి ఇవాళ మీరు మనిషిగా.

చంద్రబాబు కూడా బాధపడేలా పవన్ అసత్యాలు మాట్లాడుతున్నాడు.జన్మభూమి కమిటీ తప్ప కలెక్టర్ చెప్పినా పని కాదని చెప్పిన ప్రభుత్వంలో ఉన్న మీరు మా వాలంటీర్లపై విషం చిమ్ముతావా.

చంద్రబాబు కళ్ళలో ఆనందం కోసం తప్పితే నువ్వు చేస్తుంది ఏమిటి.?.అధికారంలో ఉన్న వారు కౌరవులు అయితే…2014లో టీడీపీ అధికారంలో ఉండగా మీరు కౌరవలా.మీరు దుశ్శాసనుడి పాత్ర పోషించావా.

కౌరవులు, పాండవులు అనేది అధికారం బట్టి రాదు…వ్యక్తిత్వాన్ని బట్టి వస్తుంది.ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేశాం…ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం జరుగుతుంది.

రోజు వారీ సమస్యలు పరిష్కారం కోసమే జగన్ స్పందన నిర్వహిస్తున్నారు.పవన్ కళ్యాణ్ కి నిజంగానే చిత్తశుద్ది ఉంటే షూటింగులు అడ్వాన్స్ ఎవరెవరి వద్ద తీసుకున్నారో వారికి న్యాయం చేయండి.

ఏ ఏం రత్నం వద్ద ఒప్పుకుని ఎన్నాళ్ళయింది…ఎన్ని రోజులు షూటింగ్ కి వెళ్ళావు.దొంగ బాబాలా దొంగ ప్రవచనాలు కట్టిపెట్టు.

మీరెన్ని చేసినా 2024 లో జగన్ నీ అదికారంలోకి తెచ్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.శాశ్విత అధ్యక్షడు అనే పద్ధతి భారత దేశంలో ఎక్కడా లేదా.

ఇలాంటి తీర్మానం టీడీపీ లో పెడితే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరుకోరు కాబట్టి గమ్మునున్నారు.వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న నీకు సాధ్యం కాదు కాబట్టి ఏదో అంటున్నారు.

మా పార్టీ మా ఇష్టం…మీకెంటి అభ్యంతరం.సాక్షాత్తు ఈ దేశ ప్రధాని స్వయంగా ఫోన్ చేసి మర్ము నీ బలపరచాలని కోరారు.అమిత్ షా కూడా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మద్దతు కోరారు.రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేసి అడిగిన మాట యదార్థం…ఆటలో అరటి పండ్లు తెలుసుకోవాలి.

ప్రధాని కార్యాలయం నుంచి మద్దతుగా సంతకం చేయాలి రమ్మని సీఎం వైఎస్ జగన్ నీ రమ్మని కోరారు.మితున్ రెడ్డి, విజయసాయిరెడ్డి సంతకాలు చేసి మద్దతు పలికారు.

మేము అంటరానివాళ్ళమైతే రేపు ముర్మూ గారు ఎందుకు వస్తున్నారు.ఆ మాటలు మాట్లాడిన సత్యకుమార్ కి నిజంగా సత్తా ఉంటే రేపు ఆమెను రాకుండా చేయండి.

స్థాయి, శక్తికి మించి మాట్లాడితే శ్రుంగ భంగం తప్ప ఏమీ ఉండదు.ఎన్నికల నిబంధనలు మారుస్తాం అన్న జీవీఎల్ శక్తి ఉంటే మా తీర్మానం వెళ్లే లోపు మార్చమనండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube