అధికారం ఉంది కదా అని అధికారమధంతో వ్యవహరిస్తే ప్రజలు సరైన సమయంలో వాతలు పడతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.నెల్లూరు మాగుంట లేఔట్ చెరుకుపల్లి పిచ్చి రెడ్డి కళ్యాణ మండపం లో జరిగిన నెల్లూరు రూరల్ వైసిపి నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను కేవలం రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే చూడాలని…శత్రువులుగా మాత్రం చూడొద్దన్నారు.
నెల్లూరు రూరల్ నియోజక వర్గం ప్రతిపక్ష కార్యకర్తలను ఎట్టి పరిస్థితిలో వేధించవద్దన్నారు.అధికారంలో ఉన్న నేతలు ఎంత తగ్గితే అంత మంచిదని ఆయన తన ప్రసంగంలో కార్యకర్తలకు, నేతలకు సూచించారు.
బాధ్యత కలిగిన వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రజలకు జవాబుదారీ తనంగా ఉండాలన్నారు.ప్రతి ఒక్కరిని ప్రేమించాలని,అధికార మధంతో వ్యవహరించే నాయకులకు ప్రజలు బుద్ది చెప్పాల్సిన రోజు.
చెప్పాల్సిన చోట చెప్పాల్సిన అదే విధంగా వాతలు పెడతారని ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలన్నారు.అదే నేపథ్యంలో రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలు దేనికి సంకేతం గా మారనున్నాయి అన్న ఆలోచనలు ఓవైపు ఉండగా… మరోవైపు మరి కొద్ది గంటలలో వెలువడనున్న ఆత్మకూరు ఉప ఎన్నికల ఫలితాలకు సంకేతంగా మారం ఉన్నాయి అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.