పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సీరియస్ వ్యాఖ్యలు..!!

నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) భేటీ ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసింది.భేటీ అనంతరం జైలు వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో వచ్చే ఎన్నికలలో టీడీపీ( TDP )… జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ ప్రకటించడం సంచలనం సృష్టించింది.

 Ycp Mla Grandhi Srinivas Serious Comments On Pawan Kalyan ,janasena, Ycp Mla Gra-TeluguStop.com

వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకొండ ఉండాలి.చంద్రబాబుకు ఇటువంటి పరిస్థితి ఏర్పడితే రేపొద్దున సామాన్యుల పరిస్థితి ఏంటి.? అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

పరిస్థితి ఇలా ఉంటే చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కావడం పట్ల భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్( YCP MLA Grandhi Srinivas ) సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు అని ప్రకటించి ప్యాకేజీ స్టార్ అనిపించుకున్నాడు అని విమర్శలు చేశారు.ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టి ఇప్పుడు చంద్రబాబు.పెంపుడు కుక్క మాదిరిగా పవన్ మారిపోయారని గ్రంధి శ్రీనివాస్ తెలిపారు.2019 ఎన్నికలలో భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేయగా.వైసీపీ తరఫున గ్రంధి శ్రీనివాస్ పోటీ చేసి గెలవడం జరిగింది.రాబోయే ఎన్నికలలో సైతం పవన్ కళ్యాణ్.భీమవరం నుండే పోటీ చేయనున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube