ఏపీలో కరోనా మహమ్మారి జోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.రాష్ట్రంలో కరోనాను అరికట్టడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది.
కానీ, కరోనా మహమ్మారి జోరు మాత్రం తగ్గడంలేదు.సామాన్యుల నుండి ప్రజాప్రతినిధులు , ప్రముఖులు కూడా కరోనా భారిన పడుతున్నారు.
ఇకపోతే , వైసీపీ కీలక నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి రెండో సారి కరోనా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.
ఆయన ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
రెండోసారి కరోనా పాజిటివ్ రావడంతో ముందస్తు జాగ్రత్తగా కరుణాకర్ రెడ్డిని అపోలోకి తరలించారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కు ఫోన్ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
ఆయనను పరామర్శించారు.భూమన కరుణాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
ఆయన ఆరోగ్యంపై ఆరా తీసిన సీఎం వయసు రీత్యా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
భూమనకు అపోలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.మూడు రోజుల క్రితం కరోనా పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్ అని తేలింది.
దీంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.