పవన్ కళ్యాణ్ రహస్యంగా తెలుగుదేశం పార్టీతో కలిసి ఉన్నట్లు వైసీపీ పార్టీ కీలక నేత ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శల వర్షం కురిపించారు.వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయటాన్ని తప్పుపడుతూ.పవన్ ఇటీవల దీక్ష చేయడానికి రెడీ అవుతున్నట్లు జనసేన పార్టీ ప్రకటించడం తెలిసిందే.12వ తారీకు మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో… కార్మిక సంఘాల నాయకులతో పవన్ దీక్ష చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ దీక్షను ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో.మాట్లాడుతూ… వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీ కేంద్రానిదే అని ప్రపంచమంతటికీ తెలుసు.ఈ క్రమంలో పవన్ విషయానికొస్తే ఆయన ఆగట్టునుంటారో ఏ గట్టున ఉంటారో తెలియదు.అందరికీ తెలిసి బీజేపీతో ఆయన ఉన్నట్లు అర్థమవుతోంది ఇటువైపు రహస్యంగా తెలుగుదేశం పార్టీతో ఉన్నరా, లేనిది…అన్నట్లు అందరూ అనుకోవటం.
ఈ క్రమంలో బీజేపీతో ఉన్న పవన్ స్టీల్ ప్లాంట్ విషయంలో వారికి నచ్చజెప్పితే బాగుంటుంది.నిర్మాణాత్మక పని చేసినట్లు ఉంటుంది.అంతే తప్ప దీనికి అఖిలపక్షం అంటూ… ఏ రకంగా ఇంప్రెస్ చేయడము అనేది నాకు అర్థం కావడం లేదు అని…పవన్ పై సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.