ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి అనురాధ(TDP candidate is Anuradha) గెలవటం సంచలనం సృష్టించింది.అయితే ఈ గెలుపు పై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
టీడీపీ పోటీ పెట్టాక మా ప్రయత్నం మేము చేసాం.చంద్రబాబు తన నేర్పరితనం చూపించారు.
మా ఎమ్మెల్యేల సంఖ్య బలాన్ని బట్టి చూస్తే క్రాస్ ఓటింగ్ జరిగింది.తెర వెనకాల డబ్బులు పనిచేశాయని అనుకోవాలి.
ఎన్నికలకు రెండు రోజుల ముందు చంద్రబాబు ప్రలోభాలు పెట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి.క్యాంపు రాజకీయాలు డబ్బులు పెట్టి చేసే రాజకీయాలలో చంద్రబాబు దేశం.
రాష్ట్రంలోనే కాదు ఏషియాలోనే సిదహాస్తుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎన్టీరామారావు ( N T rama Ra )ఉన్ననాటి నుండి ఈ రకంగానే చంద్రబాబు వ్యవహరించాలని విమర్శించారు.
అయితే క్రాస్ ఓటింగ్ ఎవరు చేశారు అన్నదానిపై ఇంకా లోతుగా వెళ్లలేదని అది పార్టీ పెద్దలు చూసుకుంటారని తెలిపారు.తనకు తెలిసి ఆనం రామనారాయణరెడ్డి ఇంకా కోటం రెడ్డి(Anam Ramanaraya Reddy and Kotam Reddy) ఇద్దరూ టీడీపీకి ఓటు వేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.ఇప్పటికే వైసీపీ నుండి ఏడుగురు ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని తెలుగుదేశం పార్టీ సభ్యులు అంటున్నారు.వాళ్ల పేర్లు మాత్రం చెప్పటం లేదు.అయితే ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీకి అభ్యర్థిని నిలబెట్టాక… తమ ప్రయత్నాలు తాము చేసామని కానీ తెర వెనక డబ్బు పని చేసి ఉంటుందని సజ్జన రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.