విజయవాడలో ( Vijayawada ) పొలిటికల్ హీట్ పెరుగుతోంది.పార్టీల్లో బుజ్జగింపులు, సంప్రదింపులు కొనసాగుతున్న నేపథ్యంలో అర్బన్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
తాజాగా విజయవాడ అర్బన్ కు చెందిన కీలక వైసీపీ నేత బొప్పన భవకుమార్( Boppana Bhavakumar ) ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే పలువురు టీడీపీ ముఖ్యనేతలు ఆయనతో వరుసగా సమావేశాలు అవుతున్నారని సమాచారం.
ఇందులో భాగంగా ఇవాళ బొప్పన భవకుమార్ టీడీపీ నేత నారా లోకేశ్ తో భేటీ కానున్నారు.
టీడీపీలో చేరిక అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.కాగా టీడీపీలోకి రావాలని బొప్పనకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్( Gadde Ram Mohan ) ఆహ్వానం పలికారు.అలాగే వంగవీటి రాధాకృష్ణ, కేశినేని చిన్ని, బోండా ఉమా బొప్పనను కలిశారని తెలుస్తోంది.
మరోవైపు బొప్పనను వైసీపీ అధిష్టానం బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది.కాగా దేవినేని అవినాశ్ కు( Devineni Avinash ) తూర్పు ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించడంతో వైసీపీ అధిష్టానంపై బొప్పన అసంతృప్తిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే.