ఏపీలో సీఎం వైఎస్ జగన్ టార్గెట్ 175 అంటూ.స్పీచులు ఇస్తున్నారు.
దాంతో అన్ని జిల్లాల ఇంచార్జుల గుండెల్లో గుబులు మొదలైంది.ప్రతి జిల్లాకు ఒక నేతలు ఇంచార్జిగా పెట్టి.
క్లీన్ స్వీప్ బాధ్యతలను అప్పగించారు.దాంతో ఆ నేతల్లో కలవరం మొదలయింది.
దాంతో ఆయా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నేతల హిస్టరీ దగ్గరి నుంచి గెలుపు గుర్రాల దగ్గరి వరకూ అన్ని బాధ్యతల్ని భుజాన వేసుకున్నారు.రాయల సీమలోని ఉమ్మడి జిల్లాల్లో అయితే ఈ హీట్ మరి కొంత ఎక్కువగా ఉంది.

ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో నేతలు టార్గెట్ 175 పై తెగ టెన్షన్ పడుతున్నారు.టార్గెట్ 175 నెరవేరాలంటే.మొదట కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఓడించాలి.అందుకోసం సీఎం జగన్ ఎప్పుడో కంకణం కట్టుకున్నారు.కుప్పం నియోజకవర్గాల్లో చాలా గ్రామాల్లో పాగా కోసం.సర్పంచులను గెలిపించుకున్నారు.
మరో వైపు చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న.కుప్పం మున్సిపాలిటీని కూడా గెలుచుకుని జలక్ ఇచ్చారు.
ఇక మిగిలింది.నియోజకవర్గం కావడంతో.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యాక్టివ్ అయ్యారు.

కుప్పం నియోజకవర్గాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి సీఎం జగన్ అదేశిస్తే.చంద్రబాబుపై పోటీ చేస్తానని ప్రకటించారు.దాంతో ఒక్కసారిగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పొలిటికల్ హీట్ రాజుకుంది.
నిజంగా అక్కడ పెద్దిరెడ్డి పోటీ చేసి గెలిస్తే.అటు పశ్చిమబెంగాల్ లో సువేందు అధికారిలా చరిత్రలో నిలిచిపోవడమే కాకుండా.
చిరస్థాయిగా జగన్ గుండెల్లో నిలిచిపోతారు.ఒక వేళ ఓడిపోయినా.
జగన్ మనసు గెలిచి.మంత్రి పదవి తీసుకోవచ్చు.అందుకే పెద్ది రెడ్డి ఈ ప్లాన్ చేశారని.రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.మరి నిజంగా పెద్దిరెడ్డి గెలుస్తారా.? వైసీపీ కుప్పం కోటపై జెండా పాతుతుందా.? జగన్ పెట్టుకున్న 175 టార్గెట్ సక్సెస్ అవుతుందా.? తేలాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.







