ఏపీ అధికార పార్టీ వైసిపి ( YCP )పూర్తిగా ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నమైంది .ఒకవైపు టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుతో ( Chandrababu arrest )ఆ పార్టీ జనాల్లోకి వెళుతూ, సానుభూతి కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఉండడంతో, వైసిపి కూడా అలెర్ట్ అయింది.
అసలు చంద్రబాబు ఎందుకు అరెస్ట్ అయ్యారు అనే విషయాన్ని జనాలకు వివరించే ప్రయత్నం చేస్తూనే .టీడీపీ పై విమర్శలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో టిడిపి , జనసేన( TDP Jana Sena ) కలిసి పోటీ చేయబోతుండడంతో , ఆ రెండు పార్టీలను ఎదుర్కొనేందుకు వైసిపి ప్లాన్ చేస్తోంది. ‘ఏపీకి జగనే ఎందుకు కావాలి ‘ పేరుతో కార్యక్రమాన్ని విజయవాడలో ఈ నెల 9 న జగన్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ మేరకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్ లో భారీగా సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు , నియోజకవర్గ ఇన్చార్జీలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు , సోషల్ మీడియా కన్వీనర్లు తో ఈ సదస్సును నిర్వహించనున్నారు. వీరందరినీ సభకు తీసుకువచ్చే బాధ్యతను ఎమ్మెల్యేలు , నియోజకవర్గ ఇన్చార్జీలకు అప్పగించారు.ఈ సభలోనే ఏపీకి జగన్( AP CM jagan ) ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమంలో రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా జనాల్లోకి తీసుకువెళ్లాలి ? ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు ఏ విధంగా అర్థమయ్యేలా చెప్పాలి ఇలా అనేక అంశాలను గురించి చెప్పనున్నారు.

వచ్చే ఎన్నికల్లో గెలుపు తమకు ఎంత ప్రతిష్టాత్మకమో చెప్పడంతో పాటు, పార్టీ శ్రేణులంతా క్షేత్రస్థాయిలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే విషయం పైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. అందుకే ఈ సభను వైసిపి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సక్సెస్ చేయాలి అనే టార్గెట్ తో వైసీపీ ఉంది.