ఏపీలో రాజకీయ పార్టీల మధ్య పొత్తులు వ్యవహారం చర్చనీయాంశం గా మారింది.ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు ? ఎవరు ఎవరికి శత్రువుగా మారుతారు అనేది క్లారిటీ రావడం లేదు.అధికార పార్టీ వైసీపీ మాత్రం తాము ఎన్నికల మేనిఫెస్టోను దాదాపు అమలు చేశామని, మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, తమ పాలనపై ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోందని, ఆ పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు.అధికార పార్టీ వైసిపి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనిచ్చేదే లేదని చెబుతూనే, జనసేన ( Janasena) అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) టిడిపి తో పాటు, బిజెపిని కలుపుకుని ఎన్నికలకు వెళ్లి వైసిపికి అధికారం దక్కకుండా చేయాలనే పట్టుదలతో ఉన్నారు.
టిడిపి తో పొత్తు పెట్టుకునేందుకు బిజెపి అధినాయకత్వం సిద్ధంగా లేకపోయినా, ఇటీవల ఢిల్లీకి వెళ్లిన పవన్ టిడిపి తో బిజెపి పొత్తు విషయమే చర్చించి , బిజెపి పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేశారు.

పవన్ ఒత్తిడి మేరకు ఇటీవలే టిడిపి అధినేత చంద్రబాబును( Chandrababu ) ఢిల్లీకి పిలిపించి బిజెపి పెద్దలు చర్చించారు.అయితే టిడిపి తో కలిసి ఎన్నికలకు వెళ్లే కంటే , వైసీపీ మద్దతు పరోక్షంగా తీసుకోవడం మంచిది అనే ఆలోచనకు బిజెపి అగ్ర నాయకులు వచ్చారట.అందుకే చంద్రబాబు ఢిల్లీ సమావేశంలో ఏ క్లారిటీ ఇవ్వకుండానే ఆయనను పంపించేశారు.
రేపు విశాఖలో అమిత్ షా పర్యటించబోతున్న నేపథ్యంలో పొత్తుల అంశంపై కీలక ప్రకటన చేస్తారనే ఉత్కంఠతో టిడిపి, జనసేన, వైసీపీలు ఉన్నాయి. బిజెపి( BJP ) తమతో పొత్తు పెట్టుకుంటే పది లోక్ సభ స్థానాలతో పాటు, ఏపీలో బిజెపికి కాస్త సానుకూలత ఉన్న నియోజకవర్గాల్లో అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు టిడిపి సిద్ధమైంది.
జగన్ దూకుడుకు బ్రేకులు వేసే విధంగా బిజెపి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు బిజెపి కేంద్ర ప్రజల వద్ద ప్రతిపాదన చేశారట.ముఖ్యంగా పోలీసులు ,గ్రామ వాలంటీర్లను ఎన్నికల సమయంలో ఉపయోగించకుండా నిరోధించాలని బిజెపిని చంద్రబాబు కోరారట.
అయితే టిడిపి( TDP ) తో పొత్తు అంటే ధృతరాష్ట్ర కౌగిలి అవుతుందని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఏపీలో బిజెపి ఎప్పటికీ బలోపేతం కాదని, ఆ పార్టీ నాయకులు అధిష్టానం పెద్దలపై ఒత్తిడి చేశారట.అంతే కాకుండా బిజెపి, జనసేన, టిడిపి కూటమిగా ఏర్పడినా, బిజెపికి ఓట్లు బడలయించే అవకాశం ఉండదని బిజెపి అగ్ర నాయకులు చంద్రబాబుకు స్పష్టం చేశారట.
అయితే టిడిపి తో పొత్తు పెట్టుకోకపోయినా, తటస్థంగా ఉండాలని చంద్రబాబు బిజెపి అగ్ర నాయకులను కోరాగా, చంద్రబాబు ప్రతిపాదనను బిజెపి అగ్ర నాయకులు తిరస్కరించారట.

అధికారికంగా బిజెపికి వైసీపీతో పొత్తు లేకపోయినా, పరోక్షంగా అన్ని విధాలు సహకారం అందిస్తోంది.దీనికి తగ్గట్లుగానే బిజెపి విషయంలోనూ వైసీపీ సానుకూలంగా ఉంటూ, అవసరం అయిన సందర్భంలో , మద్దతు ఇస్తూ వస్తోంది.జగన్ ప్రభుత్వం పై బిజెపి పెద్దలకు సానుకూలత ఉండడంతోనే , రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం 10,500 కోట్లు మంజూరు చేసి పోలవరం ప్రాజెక్టును త్వరితగతన పూర్తి చేసేందుకు 12, 900 కోట్లను విడుదల చేసి వైసిపి ప్రభుత్వం విషయంలో బీజేపీ సానుకూలంగా ఉందనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు.