ఏపీలోని వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు( YCP TDP Rebel MLAs ) ఇవాళ స్పీకర్ ముందుకు వెళ్లనున్నారు.అనర్హత పిటిషన్ పై విచారణకు వైసీపీ రెబల్స్ తర్జన భర్జన అవుతున్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరుపై వైసీపీ రెబల్స్ న్యాయ సలహా తీసుకుంటున్నారని సమాచారం.ఆరోగ్యం సరిగా లేదని ఇప్పటికే స్పీకర్ కు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy )లేఖ రాశారు.12 గంటలకు విచారణ రావాలని వైసీపీ రెబల్స్ కు స్పీకర్ నోటీసుల జారీ చేసిన సంగతి తెలిసిందే.మధ్యాహ్నం 2.45 గంటలకు విచారణకు హాజరుకావాలని టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు అందించారు.కాగా ఇవాళ స్పీకర్ ఎదుట హాజరుకానున్న టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వనున్నారు.
మరోవైపు విదేశీ పర్యటనలో ఉండటంతో వచ్చే నెల 2 వరకు గడువు కావాలని మద్దాలి గిరి కోరారని సమాచారం.