ఈ మధ్య కాలంలో విడుదలైన క్రేజీ సినిమాలలో యాత్ర 2, ఈగల్, బూట్ కట్ బాలరాజు ముందువరసలో ఉంటాయి.ఈ సినిమాలలో ఈగల్ మూవీ చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోగా యాత్ర2, బూట్ కట్ బాలరాజు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సాధించలేదు.
బూట్ కట్ బాలరాజు ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లలో రిలీజ్ కాగా యాత్ర2 ఫిబ్రవరి 8న, ఈగల్ ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ అయ్యాయి.
ఈ సినిమాల ఓటీటీ( OTT ) రిలీజ్ డేట్లకు సంబంధించి ఆసక్తికర అప్ డేట్లు వచ్చాయి.
సోహెల్ నటించిన బూట్ కట్ బాలరాజు( Bootcut Balaraju ) ఈ నెల 26వ తేదీన ఆహా( Aha ) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.ఈ సినిమా థియేటర్లలో ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించకపోయినా ఓటీటీలో హిట్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
ఆహా ఓటీటీకి రీచ్ బాగానే ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
యాత్ర 2 సినిమా( Yatra 2 ) ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్( Amazon Prime ) తీసుకుందని ప్రచారం జరుగుతోంది.థియేటర్లలో పెద్దగా ఆడని ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంటే ఈ సినిమా మరో రెండు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.యాత్ర2 మూవీ పొలిటికల్ మూవీ కావడంతో ఈ సినిమా ఓటీటీ రైట్స్ డీల్ ఆలస్యమైందని తెలుస్తోంది.ఈ సినిమా కమర్షియల్ గా ఆశించిన హిట్ కాలేదు.
రవితేజ ఈగల్ సినిమా( Eagle Movie ) ఓటీటీ రైట్స్ ను ఈటీవీ విన్ ఓటీటీ( ETV Win ) సొంతం చేసుకుంది.ఈ సినిమా డిజిటల రైట్స్ కోసం ఈటీవీ విన్ భారీ స్థాయిలో ఖర్చు చేసిందని తెలుస్తోంది.మరో రెండు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
ఈ సినిమాతో ఈటీవీ విన్ సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరుగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.