ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.అధికార పార్టీ వైసీపీ నేతల్లో కొందరు అసంతృప్తిలో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలోకి వెళ్లనున్నారనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే లోకేశ్ పాదయాత్రకు మద్ధతుగా యార్లగడ్డ పాల్గొంటారని టాక్ జోరుగా కొనసాగుతోంది.
యార్లగడ్డకు టికెట్ లేదని ఇటీవలే వైసీపీ అధిష్టానం స్పష్టం చేయగా.యార్లగడ్డ ఎక్కడికి వెళ్లాలనేది ఆయన ఇష్టమంటూ సజ్జల తెలిపారని తెలుస్తోంది.
ఇప్పటికే గన్నవరం అభ్యర్థిగా వల్లభనేని వంశీని వైసీపీ ప్రకటించింది.ఈ క్రమంలోనే వంశీ, యార్లగడ్డ, దుట్టా రామచంద్రరావు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.