చిరంజీవిని ఆ స్టార్ హీరో అపార్థం చేసుకున్నారు.. యండమూరి షాకింగ్ కామెంట్స్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలలో ఒకరనే సంగతి తెలిసిందే.చిరంజీవి ఒక్కో సినిమాకు 30 కోట్ల రూపాయల నుంచి 35 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారు.

 Yandamuri Veerendranath Shocking Comments About Chiranjeevi , Yandamuri Veerendr-TeluguStop.com

యండమూరి వీరేంద్రనాథ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి రెమ్యునరేషన్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నేను ఒక సమయంలో ఒకే డైరెక్టర్ తో పని చేశానని యండమూరి అన్నారు.

అప్పట్లో రెమ్యునరేషన్లు మాత్రమే ఇచ్చేవారని సినిమాకు వాటాలు తీసుకునే అవకాశం లేదని ఆయన అన్నారు.తనకు అభిలాష సినిమాకు 25,000 రూపాయలు ఇస్తే స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ సినిమాకు 2.5 లక్షల రూపాయలు ఇచ్చారని అప్పట్లో రెమ్యునరేషన్లు అంతే ఇచ్చేవారని యండమూరి వీరేంద్రనాథ్ కామెంట్లు చేశారు.మనకు వీలైనంత డబ్బు ఉండాలని నా వాళ్లు బాగుండాలి నేను బాగుండాలి అనే తాపత్రయం ఉండకూడదని యండమూరి వీరేంద్రనాథ్ తెలిపారు.

Telugu Abilasha, Chiranjeevi, Mohan Babu-Movie

నేను వ్యక్తిత్వ వికాస పాఠాలు బోధించడం వల్ల కోపం పూర్తిగా తగ్గిపోయిందని యండమూరి వీరేంద్రనాథ్ కామెంట్లు చేశారు.సింగపూర్ లో తాను కొడుకు, కోడలు నుంచి తప్పిపోయానని తన దగ్గర పాస్ పోర్ట్ లేదని ఫోన్ పని చేయడం లేదని ఆ తర్వాత ఒక తెలుగు వ్యక్తిని సహాయం అడిగానని యండమూరి వెల్లడించారు.ఆ వ్యక్తికి తాను ఎవరో తెలియదని యండమూరి వీరేంద్రనాథ్ పేర్కొన్నారు.

Telugu Abilasha, Chiranjeevi, Mohan Babu-Movie

కోపం తగ్గడం, నవ్వుతూ ఉండటం దీనిని క్రైసిస్ మేనేజ్ మెంట్ అంటామని యండమూరి వీరేంద్రనాథ్ కామెంట్లు చేశారు.చిరంజీవిని మోహన్ బాబు అపార్థం చేసుకున్నారని అపార్థాలు, నిందలు అనేవి కామన్ అని ఆయన అన్నారు.మహాత్మ గాంధీ, మదర్ థెరిసాను కూడా అపార్థం చేసుకున్నారని యండమూరి వీరేంద్రనాథ్ తెలిపారు.

యండమూరి వీరేంద్రనాథ్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube