రాజకీయమంటే రాజకీయమే.ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు నిరంతరం పోరాడుతూనే ఉండాలి.
తమను టార్గెట్ చేసుకున్న రాజకీయ ప్రత్యర్థులపై అదే స్థాయిలో విరుచుకుపడుతూ, ప్రతి విమర్శలు చేస్తూ ముందుకు వెళితేనే నేటి రాజకీయాల్లో నెగ్గుకు రాగలము అనే సూత్రాన్ని ప్రస్తుత రాజకీయ నాయకులు బాగానే ఒంట పట్టించుకున్న ట్లుగా కనిపిస్తోంది.ఏపీలో ఇప్పుడు అదే జరుగుతోంది.
అధికార పార్టీ వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇద్దరు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు.చంద్రబాబు టార్గెట్ గా వైసీపీ మంత్రులు కామెంట్స చేస్తుంటే, జగన్ లక్ష్యంగా టిడిపి నాయకులు విమర్శలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఏపీలో ఐటీ దాడులు వ్యవహారం లో చంద్రబాబు, లోకేష్ ను టార్గెట్ చేసుకుంటూ వైసిపి ముందుకు వెళ్తూ ఉండగా, ప్రస్తుతం కేంద్ర అధికార పార్టీ బిజెపి కూడా వైసిపికి మద్దతుగా రంగంలోకి దిగింది.

కేంద్ర దర్యాప్తు సంస్థలు టిడిపి నేతల అక్రమ వ్యవహారాలను ఒక్కొక్కటిగా వెలికి తీస్తూ హడావుడి చేస్తున్నారు.కొద్ది రోజుల క్రితం చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో జరిగిన ఐటీ దాడులు పెద్ద సంచలనం సృష్టించగా దీనిపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదంటూ వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు.చంద్రబాబు ఇప్పటికైనా నోరు విప్పాలని, ఆంధ్ర అవినీతి అనకొండ చంద్రబాబు అంటూ ఘాటుగా వైసీపీ మంత్రులు విమర్శలు చేస్తున్నారు.
దీనికి కౌంటర్ గా టిడిపి నాయకులు కూడా విమర్శలు చేశారు.ఐటీ దాడుల తో తమకు సంబంధం లేదంటూ టిడిపి ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు సమాధానం చెప్పగా, అవినీతిలో కూరుకుపోయిన జగన్ ఆ బురదలోకి అందర్నీ లాగేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా ఘాటుగా స్పందించారు.

ఇక చంద్రబాబు తనయుడు లోకేష్ వైసీపీ పై సెటైర్లు వేశారు.చంద్రబాబు లో లేని అవినీతి కంటే గుడ్డుపై ఈకలు పీకడం కౌంటర్ ఇచ్చారు.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఐటి దాడులు అటు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మరింతగా అగ్గి రాజేస్తున్నాయి.ఈ మాటల యుద్ధం లో ఒకరిని మించి ఒకరు పెర్ఫార్మెన్స్ చేస్తూ ఎవరు వెనక్కి తగ్గకుండా ఏపీ రాజకీయాలను మరింతగా జేటెక్కిస్తున్నారు.







