జనవరి 3న రిలీజ్ అవుతున్న ఎన్టీఆర్ సినిమా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఆర్ఆర్ఆర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడేందుకు తారక్ రెడీ అవుతున్నాడు.అయితే అందరికీ షాకిస్తూ తారక్ నటించిన చిత్రం జనవరి 3న రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

Yamadonga Tamil Version To Release On January 3-జనవరి 3న రిల�

తారక్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాలేదు మరి ఇంత సడెన్‌గా ఏ సినిమాను రిలీజ్ చేస్తున్నారని అనుకుంటున్నారా? రాజమౌళి డైరెక్షన్‌లో ఎన్టీఆర్ నటించిన ‘యమదొంగ’ చిత్రం రిలీజ్ అయ్యి దాదాపు 12 సంవత్సరాలు అయ్యింది.ఇప్పుడు ఈ సినిమాను తమిళంలో జనవరి 3న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు.12 ఏళ్ల తరువాత ఈ సినిమాను ఇప్పుడెందుకు రిలీజ్ చేస్తున్నారా అని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు ఆలోచనలో పడ్డారు.పుష్కర కాలం తరువాత ఈ సినిమాను తమిళ తంబీలు ఎలా ఆదరిస్తారో చూడాలి అంటున్నారు తెలుగు ప్రేక్షకులు.

ఈ సినిమాతో తమిళనాట తారక్ ఫ్యాన్‌బేస్‌ను మరోసారి ఇంప్రెస్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.మరి యమదొంగ చిత్రం తమిళంలో ఎలాంటి రిజల్ట్‌ను రాబడుతుందో చూడాలి.

Advertisement
సూపర్ స్టార్ మహేష్ బాబు నయా లుక్ వైరల్.. ఈ లుక్ మాత్రం అదిరిపోయిందిగా!

తాజా వార్తలు