రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంది.మనిషికి ఉపోయగపడే ఎన్నో సాధనాలు వచ్చాయి.
ఈ బిజి లైఫ్ లో అందరికీ ఉపయోగపడేలా కొత్త కొత్త టెక్నాలజీలో రోజుకో గాడ్జెట్ మార్కెట్లోకి వస్తోంది.ప్రతి గాడ్జెట్ కూడా ఎంతో ఉపయోగపడేవే.
మనిషి పనులను మరింత సులభంగా చేస్తున్నాయి.అయితే కొన్ని గాడ్జెట్లు మాత్రం మనిషికి ఏ పని లేకుండా సోమరితనం అలవాట్లు చేస్తున్నాయి.
తాజాగా మనిషి మెదడులోని ఆలోచనలతో పనిచేసే గాడ్జెట్ ని షావోమి రూపొందింస్తోంది.
ఎంఐజీయూ హెడ్ బ్యాండ్(Xiaomi MiGU Headband) పేరుతో షావోమి కొత్త గాడ్జెట్ ని త్వరలోనే మార్కెట్ లోకి తీసుకొస్తుంది.
ఈ గాడ్జెట్ తో ఇంట్లో ఉన్న స్మార్ట్ ఉత్పత్తులను నియంత్రించవచ్చు.ఫ్యాన్, లైట్, టీవీ వంటి వాటితో పాటు ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఉత్పత్తులను నియంత్రించవచ్చట.
అయితే వీటన్నింటినీ స్మార్ట్ ఫోన్ తో కూడా ఆపరేట్ చేయవచ్చని అనుకుంటున్నారా? కానీ ఈ హెడ్ బ్యాండ్ ఎంతో ప్రత్యేకమైంది.మనిషి మెదడులోని ఆలోచనల ద్వారా స్మార్ట్ ఉత్పత్తులను ఈ బ్యాండ్ నియంత్రిస్తుందట.

అంతేకాదు, కారు డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ బ్యాండ్ సహాయపడుతందని డెవలపర్స్ చెబుతున్నారు.ఈ బ్యాండ్ లో మూడు పాయింట్లు ఉంటాయి.ఇవి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ పొందేందుకు, యూజర్ ఎలక్ట్రో ఎన్సెపాలో గ్రఫీ వేవ్ ఫామ్స్ చదివేందుకు ఉపయోగపడతాయి.మనిషి మూడ్ ఆధారంగా వచ్చే ఎమోషన్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే వేవ్ ఫామ్స్ ని ఈ హెడ్ బ్యాండ్ లోని ఆర్టిఫిషియల్ లేబుల్డ్ మెషీన్ గ్రహిస్తుంది.
వీటి ద్వారా మనిషి చేయాలని అనుకున్న పనిని హెడ్ బ్యాండ్ కి కనెక్ట్ అయి ఉన్న స్మార్ట్ గాడ్జెట్స్ ద్వారా పూర్తి చేస్తుంది.అయితే ప్రస్తుతం ఇది పరీక్షల దశలోనూ ఉంది.
త్వరలోనూ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.







