ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా ఉండడం లేదు.ప్రేక్షకుల ఆలోచన విధానంలో చాలా మార్పు రావడం వల్ల సినిమాలో కంటెంట్ ఉందా లేదా అని చూస్తున్నారు కానీ అది పెద్ద హీరో సినిమానా చిన్న హీరో సినిమానా అనేది చూడడం లేదు.
ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది.ఇది వరకులా కాకుండా ఇప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
కంటెంట్ లేకుండా కమర్షియల్ గా వస్తే స్టార్ హీరోల సినిమాలను కూడా డిజాస్టర్స్ చేస్తున్నారు.దీంతో చిన్న హీరోలు కూడా మంచి కంటెంట్ తో వచ్చి పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు.తాజాగా మన తెలుగులో మరో మంచి కంటెంట్ ఉన్న సినిమా వచ్చింది.”రైటర్ పద్మభూషణ్”.ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబడుతుంది.

సుహాస్ నటించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంలో సఫలం అయ్యింది.ఈ సినిమా ప్రముఖుల చేత ప్రశంసలు కూడా అందుకుంటుంది.సుహాస్ హీరోగా టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను షణ్ముఖ్ ప్రశాంత్ డైరెక్ట్ చేసారు.
ఈ సినిమాకు శేఖర్ చంద్ర, కళ్యాణ్ నాయక్ సంగీతం అందించగా చాయ్ బిస్కట్ ఫిలిమ్స్, లహరి ఫిలిమ్స్ సంస్థలు గ్రాండ్ గా రూపొందించారు.

ఈ సినిమా రిలీజ్ అయిన తొలి ఆటకే ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ మాములుగా రావడం లేదు.4 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 5.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు.దీంతో చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది.ఈ సినిమాను ఇంతగా ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు మేకర్స్.
