అనకొండ పాము( Anaconda )లు దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుంటాయి.ఇవి చాలా పెద్దగా ఉన్నా విషపూరితమైనవి కావు.బరువు, పొడవు పరంగా ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద పాములుగా నిలుస్తున్నాయి.30 అడుగుల పొడవు, 250 కిలోల కంటే ఎక్కువ బరువు పెరిగే ఈ పాములను చూస్తే ఎవరైనా సరే హడలి పోవాల్సిందే.ఇంత పెద్దగా పెరిగిన ఒక పాము తాజాగా కెమెరాకి చిక్కింది.@gunsnroses3 ట్విట్టర్ పేజీ దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.దీనికి ఇప్పటికే 75 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఈ వీడియోలో చాలా పెద్దగా పెరిగిన అనకొండ పామును మనం చూడవచ్చు అది ఒక నీటి కాలువ పక్కన నెమ్మదిగా పాకుతూ కనిపించింది.
ఈ పాముకు సమీపంలోనే ఒక ఇల్లు కూడా కనిపించింది.దీన్ని బట్టి అది అడవి( Forest )లో నుంచి జనావాసాల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.ఈ వీడియో చూసిన చాలామంది షాక్ అవుతున్నారు.ఇది ఏ కంట్రీ అని అడుగుతున్నారు.ఈ కంట్రీ కి తాము అస్సలు రాము అని, ఇంత పెద్ద పాములను చూస్తేనే తాము వణికి పోతామని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక అనకొండలు సెమీ-ఆక్వాటిక్ పాములు, అంటే అవి నీటిలో ఎక్కువ సమయం గడుపుతాయి.ఇవి అద్భుతమైన స్విమ్మింగ్ స్కిల్స్ కూడా కలిగి ఉంటాయి.ఒకే సమయంలో ఇవి 30 నిమిషాల వరకు నీటి అడుగున ఉండగలవు.
అనకొండలు తమ శక్తివంతమైన కండరాలను ఉపయోగించి తమ ఎరను కుదిపేస్తాయి, వాటిని ఊపిరాడకుండా చేస్తాయి.అనకొండలు మాంసాహారులు, కాపిబారాస్, జింకలు, పందులు, ఇతర పాము( Snake )లతో సహా అనేక రకాల జంతువులను తింటాయి.
అనకొండలు ఆహారం తమ వద్దకు వచ్చే వరకు వేచి ఉంటాయి.ఆపై ఎటాక్ చేసి, ఎర చుట్టూ చుట్టుకొని, ఊపిరాడకుండా చేస్తాయి.అడవిలో అనకొండల జీవితకాలం 30 సంవత్సరాల వరకు ఉంటుంది.ఆడ అనకొండలు ఒకేసారి 100 మంది పిల్లలను కంటాయి.